ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. *ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది**చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన మోతమోగిద్దాం కార్యక్రమంలో నారా బ్రాహ్మణి*


రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి):- ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో పెద్ద ఎత్తున మహిళలతో కలసి టీడీపీ పిలుపునిచ్చిన *మోత మోగిద్దాం* కార్యక్రమంలో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఢమరుకంతో శబ్ధం వినిపించిన అనంతరం విజిల్ ఊది, డప్పుకొట్టి బ్రాహ్మణి తన నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ..‘‘మోతమోగిద్దాం’’ అనే పిలుపు కేవలం చంద్రబాబుకు మద్ధతు తెలపడం ఒక్కటే కాదని... న్యాయం జరగాలని కోరుకునే కార్యక్రమం అని పేర్కొన్నారు. న్యాయం గెలవాలి..న్యాయమే తప్పకుండా గెలుస్తుందన్నారు. టీడీపీ చేపట్టిన మోతమోగిద్దాం కార్యక్రమంలో పిలుపులో పాల్గొన్న రాష్ట్ర ప్రజలకు, మహిళలకు బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు.


*పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప మాట్లాడుతూ*...చంద్రబాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. లోకేష్ పైనా అక్రమ కేసులు బనాయించారని, దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారన్న బాధ ప్రతి ఒక్కరిలో ఉందని, జగన్ ను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రపంచ, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబబుకు మద్ధతుగా కదం తొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 30 యాక్ట్ ద్వారా ప్రజలు రోడ్లపైకి రాకూడదని, వస్తే కేసులు పెడతామని ఈ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. చంద్రబాబు కోసం అవసరమైతే త్వరలో జైల్ భరో కార్యక్రమం కూడా చేపడతామన్నారు. లోకేష్ పై పెట్టిన కేసులపైనా న్యాయపరంగా పోరాడతామన్నారు. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని, వచ్చే ఎన్నికల్లో ఓట్ల ద్వారా జగన్ కు మోతమోగిస్తామని చిన్నరాజప్ప అన్నారు.

Comments