దేశాభివృద్దికి యువత ముఖ్యపాత్రను పోషించాలి..



రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);



ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం


వ్యవసాయ కళాశాల - కాతేరు, రాజమహేంద్రవరం


**నిడిగట్ల వ్యవసాయ క్షేత్రంలోని 4 ఎకారాల్లో 350 జీడి మామిడి మొక్కలు నాటిని వ్యవసాయ కళాశాల విద్యార్థులు. 


** దేశాభివృద్దికి యువత ముఖ్యపాత్రను పోషించాలి..



..అసోసియేట్ డీన్ డా. చవాన్ శ్యామ్ రాజు నాయక్


దేశాభివృద్ధికి  నేటి తరం యువత ముఖ్య పాత్ర పోషిస్తుందని, మాతృ దేశం పట్ల దేశ ప్రజల పట్ల ఎంతో బాధ్యతో  తమ కర్తవ్యాలను నిర్వహించేందుకు  సేవా దృక్పథం కలిగి ఉండాలని అసోసియేట్ డీన్ డా. చవాన్ శ్యామ్ రాజు నాయక్ యువతకు పిలుపునిచ్చారు.


సోమవారం కాతేరు వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన జాతీయ సేవా పథకం, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ స్వచ్ఛత వక్షోత్సవాల స్వచ్ఛ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డా. చవాన్ శ్యామ్ రాజు నాయక్  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  జాతీయ సేవా పథకం గీతాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  విద్యార్థి దశ నుంచే సేవాభావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన, సమాజ సేవను తమ సేవల భావించే భావాజాలాన్ని విద్యార్థి దశ నుండి అలవాటు చేసుకోవడం అవసరమన్నారు. అప్పుడే దేశ భవిష్యత్తుకు మన వంతు పునాది వేసినట్లు వేసి నట్లవుతుందన్నారు. ఏది ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం ద్వారా జాతీయ సేవా పథకం వాలంటీర్లుగా చేరుతారన్నారు.  సమాజ అభ్యుదయమే ధ్యేయంగా సేవలందిస్తున్న జాతీయ సేవా పథకం 1969 సెప్టెంబర్ 24న ఏర్పాటు చేసారన్నారు. అందుకే ప్రతి ఏడాది  జాతీయ సేవా పథకం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని వివరించారు. అంతేకాకుండా జాతీయ సేవా పథకం వాలంటీర్లు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు ఉన్న గ్రామాలకు వెళ్లి ఏదో ఒక రూపంలో సేవలందించాలని, మూఢనమ్మకాలతో ఉన్న ప్రజలను  చైతన్య పరచాలని సూచించారు. దేశాభివృద్దికి యువత ముఖ్యపాత్రను పోషించాలన్నదే ఈ సభ యొక్క ముఖ్యోదేశ్యమని ఆయన అన్నారు. 


  ఇందులో భాగంగా  నిడిగట్ల వ్యవసాయ క్షేత్రంలో  విద్యార్థినీ విద్యార్థులచే 350 జీడి మామిడి మొక్కలు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నాటించారు. 


సమావేశంలో  జాతీయ సేవా పథకం అధికారులు  డా. పి. అమ్మాజీ, డా. జి. రమేష్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ద్వారా వారు పొందిన అనుభూతిని తెలియజేశారు.                               


ఈ కార్యక్రమంలో బోధన సిబ్బంది   డా. విజయ శంకర్ బాబు, డా. విజయ కృష్ణకుమార్,  బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.


Comments