ప్రత్యేక ఆహ్వాన సభ్యుడిగా జేపి రెడ్డి నియామకం.

 *ప్రత్యేక ఆహ్వాన సభ్యుడిగా జేపి రెడ్డి నియామకం


*


విజయవాడ (ప్రజా అమరావతి );ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రత్యేక ఆహ్వాన సభ్యుడిగా నలుగురిని నియమిస్తూ దేవాదాయ దర్మాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులలో తాడేపల్లికి చెందిన జెక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (జేపి) నియమిస్తూ ఉత్తర్వులు వెలువడినాయి. ఈ సందర్భంగా తనను సభ్యుడిగా నియామకం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి,  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యంనారాయణకు మరియు తనకు ఈ పదవి రావటంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు కృతజ్ఞతలు జేపి తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకంకు రుణపడి ఉంటానని ఆ దుర్గమ్మ సన్నిధిలో తన వంతు సహాయ, సహాకారాలు అందచేస్తు అమ్మవారి సేవ చేసుకుంటానని జేపి రెడ్డి తెలియజేశారు.


సభ్యుడిగా నియామకం అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నియామక పత్రంను నేడు ఆలయ ఈఓ భ్రమరాంబ చేతుల మీదుగా జేపి రెడ్డి స్వీకరించారు.

Comments