అర్జీలకు మెరుగైన పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

 అర్జీలకు  మెరుగైన పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు



పుట్టపర్తి, సెప్టెంబర్ 4 (ప్రజా అమరావతి):  స్పందనలో అందే ప్రతి అర్జీకి మెరుగైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులు ఆదేశించారు.పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ 236    అర్జీలను  స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్  టీఎస్ చేతన్ ,డిఆర్ఓ కొండయ్య,డి ఆర్ డి ఎ పి డి  నరసయ్య, గ్రామ వార్డు సచివాలయ  నోడల్ ఆఫీసర్ శివారెడ్డి,   పుట్టపర్తి ఆర్డిఓ   భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  వర్చువల్ విధానం ద్వారా మాట్లాడుతూ రీ ఓపెన్ పిటిషన్ లు 4 ఉన్నాయని, రీ ఓపెన్ పిటిషన్లు రాకుండా నాణ్యతగా పిటిషన్లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్ లను సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలన్నారు. రీఓపెన్ పిటిషన్లను జిల్లా అధికారులు నిత్యం ఓపెన్ చేసి చూసుకోవాలని, అర్జీదారుడితో మాట్లాడాలని, అర్థమయ్యేలా అతనికి వివరించాలని, సమాచారం తెలియజేయాలని, సంతృప్తి కలిగేలా పరిష్కారం చూపించి ఎప్పటికప్పుడు పిటిషన్లను క్లోజ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్, ఆర్డీఓలు పిటిషన్ లకు పరిష్కారం నాణ్యతగా అందించాలన్నారు. ప్రాపర్ గా స్పందన పిటిషన్ లను పరిష్కరించాలని ఆదేశించారు. 


. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన పలు అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.


*   సోమందేపల్లి  మండలం మాగే పల్లి గ్రామానికి చెందిన లేట్ బాలయ్య కుమారుడు వెంకట్రాముడు కు చెందిన సర్వేనెంబర్ 202. 5 లోని0.25 సెంట్ల భూమిని పలువురు కబ్జా చేశారని ఈ అంశంలో తనకు న్యాయం కల్పించవలసిందిగా వినతిని సమర్పించారు.


*   హిందూపురం ముదిరెడ్డిపల్లె కు చెందిన సరళ అనే వితంతువుకు అర్హత ఉన్నా కూడా సంవత్సర కాలంగా వితంతు పింఛను మంజూరు కాలేదని ఫిర్యాదు చేసింది. 


గాండ్లపెంట మండలం మలమీద పల్లి సచివాలయం సంబంధించి భారతీయ అనే మహిళకు ఉన్న రేషన్ కార్డులో బ్రతికున్న వ్యక్తుల పేర్లు చనిపోయినట్లుగా నమోదు కాపాడినవని 

  పేర్కొంటూ అర్జీని సమర్పించింది.


జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పెన్షన్లు, పట్టాదారు పుస్తకాలు మంజూరు, భూతగాదాల పరిష్కారం, ఇంటి స్థలాలు మంజూరు లాంటి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.


*ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, బీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డిఎస్ఓ వంశీకృష్ణ, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments