జగనన్న ఆరోగ్య సురక్ష* *ఇంటింటి సర్వే వేగవంతం* *చేయాలి....

 


 *జగనన్న ఆరోగ్య సురక్ష* *ఇంటింటి సర్వే వేగవంతం* *చేయాలి....* 


                *జిల్లా కలెక్టర్ వె.* *ప్రసన్న వెంకటేష్ ఆదేశం...* 


ఏలూరు, సెప్టెంబరు, 25 (ప్రజా అమరావతి);... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వేను వేగవంతం చేసి ఈ నెల 30వ తేదీనాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పధకాలపై  జిల్లాస్ధాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు.   


ఈ సమావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్షకార్యక్రమం ఈనెల 30వతేదీన ప్రారంభిస్తున్న సందర్బంగా ప్రతిగ్రామంలోను ఎఎన్ఎంలు, ఇంటింటి సర్వే చేపట్టి టోకెన్ లను పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.  జగనన్న సురక్ష సర్వే జిల్లాలో కొన్ని మండలాల్లో వెనుకబడి వుందని దీనికి గల కారణాలను సమావేశంలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈనెల 30వ తేదీలోగా సర్వేను,టోకెన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.  


వ్యవసాయశాఖకు సంబంధించి పిఎంకిసాన్, ఈకెవైసి ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలన్నారు.  భూరీసర్వే పై సమీక్షిస్తూ భూ రీసర్వే ,స్టోన్ ప్లాంటేషన్ టార్గెట్ ప్రకారం పూర్తిచేయాలన్నారు. కొన్ని మండలాల్లో భూరీసర్వే, స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ సజావుగా జరగడం లేదని కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.     


జిల్లాలోని ఐటిడిఏ ఏజెన్సీలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఏర్పాట్లకు స్ధలాల కేటాయింపు చేయాలన్నారు.  నవరత్నాల పధకాలు అర్హులైన అందరికి అందాలని దీనిపై వచ్చిన అర్జీలను తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని తెలిపారు.  


నాడు-నేడుకింది జిల్లాలో చేపట్టినపనుల ప్రగతిపై సమీక్షిస్తూ తక్షణమేపనులు పూర్తిచేసి భవనాలను సిద్దం చేసి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  గోడౌన్స్ నిర్మాణ పనులపై సమీక్షిస్తూ త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.  


ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు, డిపిఓ టి. విశ్వనాధ్ శ్రీనివాస్, పశుసంవర్ధకశాఖ జెడి జి. నెహ్రూబాబు, డిఎంహెచ్ఓ డా. శర్మిష్ట, అధనపు డిఎంహెచ్ఓ డా. రాజీవ్, జిఎస్ డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ, డ్వామా పిడి ఎ. రాము, డిఇఓ శ్యామ్ ప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్ఇ వెంకటేశ్వరరావు, తదితర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. 


Comments