ప్రభుత్వ పరిపాలనలో ఉద్యోగులదే ముఖ్య భూమిక.

 శాసనసభ (ప్రజా అమరావతి);


*అసెంబ్లీలో ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*మనసా వాచా కర్మణా ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*


*ఉద్యోగులకు బాధ్యతగా ప్రభుత్వం అర్హమైన, న్యాయమైన  జీపీఎస్  అందించనుంది*


*ప్రభుత్వ పరిపాలనలో ఉద్యోగులదే ముఖ్య భూమిక*


*11వ పీఆర్సీ అమలు చేయడానికి ముందు మధ్యంతర భృతి అందించాం*


*ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం*


*ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు విషయంలో ప్రత్యేక సౌలభ్యం అందించాం*


*చిన్నారులను దత్తత తీసుకున్నపుడు సెలవులను 3 నెలల నుంచి 6 నెలలకు పెంచాం*


*చైల్డ్ కేర్ లీవ్ ను 60 రోజులు నుంచి 180 రోజుల వరకూ పెంచాం*


*రిస్క్ లో పని చేసే నర్సులు సహా కొంత మందికి స్పెషల్ క్యాజువల్ 7 రోజులు ఎక్కువ చేశాం*


*కుష్ఠు, క్యాన్సర్, మానిసిక వ్యాధుల వంటి కొన్నింటి బారిన పడినవారికీ ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా చర్యలు*


*ఉద్యోగి అకాల మరణం చెందితే 'ఫ్యామిలీ పెన్షన్' అందిస్తున్నాం*


*కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ , డైలీ వేజ్ జీతభత్యాలు 01,జనవరి,2022 నుంచి పెంచాం*


*రివైజ్డ్ పే స్కేల్-2022 ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత సంవత్సరం నుంచి ఎంటీఎస్*


*2, జూన్ 2014కు ముందు నుంచి కాంట్రాక్ట్ లో ఉన్న మొత్తం 10,117 మందిని రెగ్యులరైజ్ చేస్తాం*


*కనీస పరిమిత కాలం పరిధిని పట్టించుకోకుండా అందరికీ న్యాయం చేసేలా నిర్ణయం*


*ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు చేసేలా తీవ్ర కసరత్తు*


*53వేల మందికిపైగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాం*


*తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకుని అనుసరించే ప్రయత్నం చేస్తోంది*


*పాదయాత్రలో ఇచ్చిన హామీ విషయవలో వెనక్కి తగ్గకుండా సీఎం ప్రభుత్వం రాగానే అడుగులు*


*14,650 మంది అటానమస్ బాడీలో ఉండి పని చేసే వైద్యవిధాన పరిషత్ వారిని కూడా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో చేర్చి రెగ్యులరైజ్ చేశాం*


*ఉద్యోగలికిచ్చే జీతభత్యాల అంశంలో ప్రతి శాఖ, ప్రతి రంగంలో పెంచాం*


*సీఎం జగన్ ప్రతిపక్షనాయకుడి హోదాలో ఇచ్చిన హామీలపై అప్రమత్తమైన గత ప్రభుత్వం కొందరికి ఎన్నికల ముందు జీతాలు పెంచింది*


*43 వేల మంది ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు..తద్వారా రూ.150 కోట్ల నుంచి రూ.517 కోట్ల భారం అయినా ముందుకు*


*28,815 మంది ట్రైబల్ కమ్యునిటీ హెల్త్ వర్కర్లు, మున్సిపల్ ఔట్ సోర్స్ హెల్త్ వర్కర్లకు రూ.18వేల జీతం చేశాం..తద్వారా రూ.415 కోట్ల నుంచి రూ.622 కోట్లకు ఖర్చు పెరిగింది*


*మెప్మా రీసోర్స్ పర్సన్ లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు జీతం పెంచాం, సెర్ప్ విలేజ్ ఆర్గనైజేషన్స్ జీతం రూ.2వేల నుంచి రూ.10వేలు చేశాం*


*16వేల మంది హోంగార్డులకు జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెంచాం, తద్వారా రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఏడాదికి ఖజనాపై రూ.200 కోట్ల భారం*


*48,770 మంది అంగన్ వాడీ వర్కర్లకు రూ.7 వేల నుంచి రూ.11,500 జీతం పెంచాం, 55వేల మంది అంగన్ వాడీ హెల్పర్లకు రూ.4వేల నుంచి రూ.7వేలకు జీతం పెంచాం*


*సెర్ప్ లో పని చేసే 4,569 మంది  హెచ్ఆర్  ఉద్యోగులకు 23 శాతం జీతం పెంచాం*


*108 వాహనాలను నడిపే డ్రైవర్లకు రూ.13 వేల నుంచి రూ.28వేలకు పెంపు, 104 వాహనాల డ్రైవర్లకు రూ.26వేలకు పెంపు, ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషిన్లకు రూ.15,500 నుంచి రూ.20వేలకు పెంపు*


*3 లక్షల మందికి పైగా శానిటేషన్ వర్కర్లకు, మున్సిపల్ వర్కర్ల అర్హతను పరిగణలోకి తీసుకుని రూ.8వేల నుంచి రూ.18 వేలకు పెంచాం, తద్వారా రూ.2 వేల కోట్ల ఖర్చు రూ.3,500 కోట్లకు పెరిగింది*


*ఆర్థిక ఇబ్బందులెన్నున్నా చిరుద్యోగులందరికీ ఆర్థిక పరిపుష్టిని  కల్పించిన ప్రభుత్వం మాది*


*వారం రోజులు నిర్విరామంగా విధులు నిర్వర్తించే పోలీసులకు 23.10.2019 తర్వాత వీక్లీ ఆఫ్ సౌలభ్యం కల్పించాం*


*ఆప్కోస్ ఏర్పాటు చేసి ఏజెన్సీల వ్యవస్థను ప్రక్షాళన చేసి ఉద్యోగులందరికీ ఒక పద్ధతిగా పనికి తగ్గ జీతం విషయంలో ఉపశమనం కలిగించాం*


*ఔట్ సోర్సింగ్ లోనూ రిజర్వేషన్లు కల్పించాం, నెలలో మొదటి రోజునే జీతం అందిస్తున్నాం*


*నియామకాలు,చేపట్టాం.. ఈపీఎఫ్,ఈఎస్ఐ వసతులు కల్పించాం*


*విలేజ్, వార్డ్ సెక్రటరియేట్ లలో 1,35,000 మందికి ఉద్యోగాలిచ్చాం.. పరిపాలను ప్రజల ముంగిటకు చేర్చాం*


*2,50,00 మందికి పైగా వాలంటీర్లను నియమించి ప్రజా సంక్షేమం డోర్ డెలివరీ చేశాం*


*రూ.4వేల కోట్లను ఖర్చుపెట్టి సచివాలయాలను ఏర్పాటు చేసి తద్వారా ఆదర్శ , అవినీతి లేని పరిపాలన అందిస్తున్నాం*


*వైద్య రంగంలో 53,126 మంది ఉద్యోగ సిబ్బందిని నియమించాం*


*3,899 మంది స్పెషలిస్ట్ లు, 2,088 మంది మెడికల్ ఆఫీసర్లు, 6,734 మంది స్టాఫ్ నర్సులు, 10,132 మంది ఎంఎల్ హెచ్ పీలు, 13,740 ఏఎన్ఎంలు, 9,750 పారామెడికల్ స్టాఫ్, 3,303 నాలుగో తరగతి ఉద్యోగులు, 249 మంది డీఈవోలు, మెడికల్ కాలేజీలకు 15,082 మంది, ఇతరులు 1,958 మందిని కొత్తగా నియమకాలు చేపట్టాం*


*6,001 మంది పోలీసుల పోస్టులకు నియామక ప్రక్రియ*


*2 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాం*


*గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న వయసులోనే మనసులో మాట రాశారు*


*ప్రభుత్వ ఉద్యోగులలో విద్యుత్ 66 శాతం, పౌరసరఫరాల శాఖలో 65 శాతం, రెవెన్యూ 64 శాతం, పోలీసులు 62 శాతం, స్థానిక సంస్థలలో 52శాతం మంది అవినీతిపరులని ఆయన మనసులో మాటలో చెప్పారు*


*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడగానే 2019లో మంత్రి వర్గ ఉప సంఘం, సీనియర్ అధికారులతో వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం*


*కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు, విడతలవారీగా అర్హత పరిశీలించి, పరీక్షలు నిర్వహిస్తూ రెగ్యులరైజ్ చేయాలనే దిశగా కూడా ఆలోచించాం*


*కాలపరిమితే చూడకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలన్న విషయంలో  సీఎం ప్రత్యేక చొరవ*


*వయసు, విద్య, రిజర్వేషన్,  పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ*


*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా బాగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ఉద్యోగులకు రావాల్సిన లబ్ధిని  ఆపాలనేలా చర్యలు*


*ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ సిస్టం బిల్ -2023ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*ఈ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా  అధ్యయనం చేస్తోంది*


*కొన్ని దేశాల్లో పని చేస్తున్న సమయంలోనే ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ**మంత్రి వర్గ ఉపసంఘం, అధికారుల నేతృత్వంలో ఈ జీపీఎస్ రూపకల్పనకోసం అనేక నమూనాలు పరిశీలించాం*


*ప్రజా సేవకులకు సొంత ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనమే ముఖ్యం*


*చాణక్య అర్థశాస్త్రంలో చెప్పినట్లు మా ప్రభుత్వానికి ప్రజలే ముందు* 


*ఉడ్రొ విల్సన్ 28వ యూఎస్ఏ ప్రెసిడెంట్ ..మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు*


*లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపనలో ఆయనది ముఖ్య పాత్ర*


*సమాజ నిర్మాణంలో "ప్రభుత్వ ఉద్యోగులే కీలకం..వారికి సేవలందించకపోతే మనల్ని మనమే పేదరికంలో పడవేసుకున్నట్లు"*


*జాన్ ఆఫ్ కెన్నడీ అనే ప్రఖ్యాత రాజకీయవేత్త చెప్పినట్లు దేశం మనకేమిచ్చింది అన్నదానికన్న దేశానికి మనమేం ఇచ్చాం అన్నదే ముఖ్యం*


*ప్రపంచవ్యాప్తంగా పెన్షన్ అనేది ప్రభుత్వాలకు కీలకమైన ప్రక్రియ*


*20 ఏళ్లుగా ఆర్బీఐలో భాగస్వామ్యమైన డాక్టర్ ఆత్రి ముఖర్జీ అనే మహిళ, ఎకనమిక్ పాలసీ పరిశోధనలో భాగమైన రచిత్ సోలంకి, ఆర్బీఐ డైరెక్టర్ రీసెర్చ్ సోమనాథ్ శర్మ, డైరెక్టర్ మానిటరీ పాలసీ, ఆర్బీఐ ఆర్కే సిన్హా వంటి మహామహులు రచయితలుగా ఓపీఎస్ (డీసీఎస్),ఎన్ పీఎస్(సీపీఎస్)పై ఎన్నో ఆర్టికల్స్ రాశారు*


*వివిధ కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఓపీఎస్ కొనసాగించడం కష్టసాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు*


*రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్, ఎన్ పీఎస్ అమలుకు ఉన్న అవకాశాలపై నిజాయతీగా కసరత్తు చేసింది*


*ఒకవేళ మొండిగా ఓపీఎస్ ను అమలు చేయడానికే ప్రభుత్వం నిర్ణయించుకుంటే రాబోయే 10ఏళ్ల తర్వాత కాలంలో ఉద్యోగులకు జీతభత్యాలిచ్చే పరిస్థితి ఉండదు*


*ఎన్ పీఎస్ ను తీసుకొచ్చిన భారంగా నడుపుతున్న రాష్ట్రాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మాత్రమే*


*తాత్కాలిక సంతృప్తి, సంబరం మా ప్రభుత్వ విధానం కాదు*


*ప్రపంచ దేశాలు, ఇతర రాష్ట్రాలు, అక్కడి ఉద్యోగులు, పెన్షన్ విధానాలు, ఆర్థిక పరిస్థితులపై బేరీజు వేసి భవిష్యత్ ను భావితరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యేమార్గంగా ఈ విధానం తీసుకొచ్చాం*


*హెచ్ ఆర్ పాలసీ, పెర్ క్యాపిటా, రాబడి, ఖర్చు, ఓపీఎస్,ఎన్పీఎస్ ల మధ్య తేడా, పెన్షన్ లపై పరిశోధన చేశాం*


*రాజకీయం, ఎలక్షన్ గురించి ఆలోచిస్తే మమ అనిపించగలం, కానీ, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాం, మథనపడ్డాం,  అవకాశం, పరిధి, ఆర్థిక స్థితిగతుల మేరకు హైబ్రిడ్ మోడల్ అమలుకు నిర్ణయం తీసుకున్నాం*


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,07,070 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు*


*ఓపీఎస్ ఉద్యోగులు 2, 02,520 మంది, సీపీఎస్ ఉద్యోగులు 3,73,770 మంది, రెగ్యులర్ పెన్షన్ 2,04,663, ఫ్యామిలీ పెన్షన్స్ 1,69, 107 మంది ఉన్నారు*


*2060 కల్లా 1,60,00 కోట్లు ఖర్చు పెన్షన్ మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి*


*ఓపీఎస్ కొనసాగిస్తే 2041 కల్లా అప్పు పుట్టని దశకు చేరి విలవిలాడడం ఖాయం*


*భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ జీపీఎస్ ను అమలు చేయడం ఖాయం*


*మనసు, మేధస్సు కలిపి మంచి చేయడమే సంకల్పంగా జీపీఎస్ ను తయారు చేశాం*


*ఒకవేళ ఉద్యోగికి రూ.50 వేలు చివరి జీతం అయితే జీతంలో 50 శాతం ఇచ్చేలా ప్రభుత్వం బాధ్యత*


*ఉద్యోగి చనిపోతే స్పాస్ పెన్షన్ కింద 60శాతం పెన్షన్*


*ఉదాహరణలతో ప్రజంటేషన్ ఇచ్చిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*డీఆర్, ఉద్యోగుల హెల్త్ స్కీం లు జీపీఎస్ లో అదనం*


*దేశం, రాష్ట్రం బాగున్నప్పుడే మనం బాగుంటామంటూ ముగించిన ఆర్థిక మంత్రి బుగ్గన*
Comments