నాణ్యమైన ఫోటో ఓటర్ల జాబితాలు తయారీకి కృషి చేయాలి.

 

మచిలీపట్నం, సెప్టెంబర్ 4 (ప్రజా అమరావతి);


*ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పటిష్టవంతంగా నిర్వహించాలి-కలెక్టర్*


*నాణ్యమైన ఫోటో ఓటర్ల జాబితాలు తయారీకి కృషి చేయాలి*జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం వేగవంతం చేయాలని, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు డిఆర్వో కు సూచించారు.


రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు.


జిల్లా కలెక్టర్ డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు


అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం వేగవంతం గావించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన ఫారం-6  వివరాలు ఫారం-9 లిస్టులో అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఫారం-6 అధిక సంఖ్యలో వచ్చిన సందర్భాల్లో సమగ్ర పరిశీలన జరపాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు జనరేట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షిస్తున్నదని అన్నారు. ప్రతి సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. కావున ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పటిష్టవంతంగా నిర్వహించాలని, నాణ్యమైన ఓటర్ల జాబితాలు తయారు చేయుటకు కృషి చేయాలని అన్నారు

Comments