అమరావతి (ప్రజా అమరావతి);
•సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-
• అన్ని పుణ్యక్షేత్రాల నిలయం నంద్యాల.
• నంద్యాల జన సందోహం చూసి చెపుతున్నా...వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం
• ఇక్కడ ఎంపిగా పని చేసిన నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతి అయ్యారు.
• ఇక్కడ పోటీ చేసిన పివి నరసింహారావు ప్రధాని మంత్రి అయ్యారు.
• పివిపై నాడు ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టలేదు. అదీ ఎన్టీఆర్ ఔదార్యం.
• నాలుగున్నరేళ్లుగా చెత్త ప్రభుత్వం ఉంది. ఈ సండే ఎమ్మెల్యే నంద్యాలలో ఒక్క పని చేశాడా
• అభివృద్ది అంటే ఏంటి...సంక్షేమం అంటే ఏంటో నంద్యాలకు చూపించాం. కర్నూలులో అభివృద్ది చేసింది టీడీపీ
• కర్నూలులో మనం ఎయిర్ పోర్టు కడితే.....సిగ్గు లేకుండా జగన్ అతని పేరు పెట్టుకున్నాడు
• ఓర్వకల్లులో పారిశ్రామిక వాడ తెచ్చాం. ఇక్కడ అనుకున్న కంపెనీలు వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవి
• మన హయాంలో జైన్ ఇరిగేషన్ సిస్టం తెచ్చాం....సీడ్ పార్క్ తెచ్చాం.
• వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా...ఒక్క ఉద్యోగం వచ్చిందా
• నాడు రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. మన ప్రయత్నం అంతా జగన్ వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.
• రూ. 549 కోట్లతో ముచ్చుమర్రి పూర్తి చేసి నాడు నీరు ఇచ్చాం. జగన్ దాన్ని పూర్తిగా ఆపరేట్ చేయలేకపోతున్నాడు.
• రాయల సీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి, సీమలో మనం 12 వేల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చు చేస్తే...జగన్ కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశాడు
• రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. నేడు టమాటా ధర పతనం అయ్యింది. రైతులు దెబ్బతిన్నారు.
• ఆడబిడ్డలు నిత్యావసరవస్తువులు కొనే పరిస్థితిలో లేరు. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది.
• పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి, కరెంట్ చార్జీలు 8 సార్లు పెరిగాయి. ఎన్నికల ముందు ఈ పెద్దమనిషి ఏం చెప్పాడు...
• రూ. 200 కరెంట్ బిల్లు నేడు రూ. 1000 అయ్యింది....వెయ్యి వచ్చే కరెంట్ బిల్లు నేడు రూ. 5 వేలు అయ్యింది
• 5 ఏళ్లలో ఒక్క సారి కూడా కరెంట్ చార్జీలు కూడా పెంచలేదు
• నేడు కరెంట్ చార్జీల కారణంగా ఫ్యాన్ స్విచ్ వేస్తే షాక్ కొడుతుంది.
• జగన్ అవినీతి వల్ల కరెంట్ చార్జీలు పెరిగాయి, బొగ్గు కోనుగోళ్లలో కూడా దోపిడీ చేశారు.
• ఓర్వకల్ లో సోలార్ పార్క్ తెచ్చాం, సోలార్ పార్క్ వల్ల 2 రూపాయాలకు కరెంట్ వచ్చింది.
• సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ద్వారా కరెంట్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు.
• టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు పెంచను. అవసరం అయితే కరెంట్ చార్జీలు తగ్గిస్తా.
• ఎక్కడైనా ఇసుక దొరుకుతోందా....మీ ఊరు ఇసుక హైదరాబాద్ లో దొరుకుతుంది.
• ఉచిత ఇసుక ఇచ్చి...నిర్మాణ రంగాన్ని మనం బతికించాం. తద్వారా ఉపాథి కల్పించాం.
• కానీ నేడు వైసీపీ ఇసుక దోపిడీ కారణంగా 40 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
• నంద్యాలలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఆటోనగర్ స్థలాలు ఇచ్చాం.
• పెట్రోలు, డీజిల్ ధరలు కర్నాటక కంటే ఏపీలో రూ. 12 ఎక్కువ. ఒక్కో ఆటోపై ఏడాదికి రూ. 20 వేలు ఆటోవాలాలకు ఖర్చు అవుతుంది. రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో ఆటోలకు రిపేర్లు. పైగా ఫైన్లు. ఇది పైగా ఫైన్ ల రాజ్యం
• జగన్ ట్యాక్స్ ల వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ నాశనం అయ్యింది.
• జగన్ రెడ్డి దోపిడీకి మందు బాబులు కూడా విలవిల్లాడుతున్నారు.
• జగన్ ఎన్నికల ముందు మద్యపాన నిషేదం అన్నాడు, మద్యం రేట్లు విపరీతంగా పెంచి సొంత బ్రాండ్లతో పేదల రక్తాన్ని తాగుతున్నాడు.
• మందుబాబుల్ని తాకట్టు పెట్టి మీద 25 ఏళ్లకు అప్పు తెచ్చాడు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా...అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.
• వ్యవసాయ శాఖ, మునిసిపల్ శాఖ, మైనారిటీ శాఖ...ఏ శాఖా పనిచేయడం లేదు.
• రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. వీళ్లా మంత్రులు అనిపిస్తుంది.
• ఉదయం లేచింది మొదలు అప్పుల కోసం తిరిగేవాడు ఆర్థిక శాఖా మంత్రి, పిట్టకథల మంత్రి బుగ్గన.
• కార్మికులకు ఉపాథి కల్పించలేడు కానీ....పేకాట శిబిరాలు...ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాడు కార్మిక శాఖా మంత్రి, బెంజ్ మంత్రి గుమ్మనూరు జయరాం.
• గనులు, ఇసుక మింగేవాడు....గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి. పెద్ద బకాసురుడు.
• వర్షాలకు, అకాల వర్షాలకు, వర్షాభావానికి తేడా తెలియని వాడు వ్యవసాయ శాఖా మంత్రి...అతనే కాకాని.
• సొంత ఊళ్లో పిల్లకాలువలో పూడిక తీయలేని వాడు....ఇరిగేషన్ మంత్రి...అతనే సంబరాల రాంబాబు.
• సొంత ఊళ్లో పంటలను కొనలేని వెర్రిపప్ప పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి.
• పెట్టుబడులు అంటే కోడిగుడ్డు కథలు చెప్పేవాడు....పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాధ్
• గురువు కంటే గూగుల్ గొప్పది అనేవాడు మొన్నటి వరకు విద్యాశాఖా మంత్రి.
• నన్ను తిట్టిన వారికి మంత్రి పదవులు. నన్ను తిట్టడానికే వారికి మంత్రి పదవులు.
• నంద్యాల రాగానే నాకు అబ్దుల్ సలాం ఆత్మహత్య గుర్తుకువస్తుంది.
• నా జీవితంలో నన్ను ఎక్కువగా కలిచివేసిన ఘటన అబ్దుల్ సలాం ఘటన
• జగన్ ఈ ఘటనకు కనీసం సిగ్గు పడలేదు బాధ పడలేదు. సండే ఎమ్మెల్యే ఏం చేశాడు. వారిని ఎందుకు కాపాడ లేదు
• మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా
• 1985లో మైనార్టీ కార్పొరేషన్ - కర్నూలులో ఉర్థూ విశ్వవిద్యాలయం
• కడప, విజయవాడ హజ్ హౌస్ - 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా
• ముస్లిం సోదరులారా....రంజాన్ తోఫా వస్తుందా? దుల్హన్ పథకం ఉందా?
• వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాం - ఇమాంలకు రూ.5 వేలు, మౌజంలకు రూ.3 వేలు ఇచ్చాం
• అందుకే బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ.
• సంక్షేమానికి నాంది పలికిన పార్టీ టీడీపీ...రూ. 5 అన్న క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టాం,
• దాన్ని రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన దుర్మార్గులు వీళ్లు
• రూ. 10 ఇచ్చి రూ. 100 లాగడం పాలన కాదు, అది దోపిడి
• చంద్రన్న భీమా, పెళ్లికానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక అందించాం
• తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కరికీ ఏటా రూ.15వేలు అందిస్తాను
• ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్లు పైబడి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.1500లు అందిస్తాను
• ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను
• జాబు రావాలంటే బాబు రావాలి,
• యువతకు నిరుద్యోగ బృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా.
• ప్రపంచాన్ని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని శక్తివంతంగా తయారు చేస్తా....
• టీడీపీ 5 ఏళ్లలో రూ 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.30 లక్షల ఉద్యోగాలు కల్పించాం
• ఐటీ ఆయుధం మీకిస్తా...ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు మీ దగ్గరకు తెస్తా..వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి దగ్గరే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తా
• మీ గ్రామాల్లోనే వర్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తా...లేదంటే ఇతర నగరాలు, దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తా
• రైతును రాజును చేస్తా...రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం
• సురక్షిత మంచినీరు అందిస్తాం,
• పి 4 ద్వారా పేదల్ని ధనికుల్ని చేస్తాం
• 2014-19 లో నంద్యాలలో 10,300 ఇళ్లు నిర్మించాం, వాటికి రంగులు వేసి పాడు పెట్టారు
• రూ. 1500 కోట్లతో రోడ్లు, కాలువలు బాగు చేశాం
• వెలుగోడు నంద్యాల త్రాగునీటి పైప్ లైన్ కి రూ. 130 కోట్లు శాంక్షన్
• కుందు నది, చామ కాలువ, మద్దిలేరు వాగుల్లో పూడిక తీసి సుందరీకరణ ప్రారంభించాం, ఇప్పుడు అన్నీ పనులు ఆగిపోయాయి
• ఇక్కడ సండే ఎమ్మెల్యే ఉన్నాడు, అని ఆయనకే కావాలి
• ఆయన అనుచరుల్లో ఒకరికి మున్సిపల్, రెవిన్యూ, ప్లానింగ్ డిపార్ట్ మెంట్లు అప్పజెప్పి అవినీతి చేస్తున్నారు
• ఎక్కడ భూములు కనపడితే అక్కడ డేగల్లా వాలిపోతున్నారు
• టీడీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తా..మీ జీవితాల్లో వెలుగులు తెస్తా
• ఈ ప్రభుత్వం ఉంటే మన జీవితాలు నరకమే..ఈ ప్రభుత్వం పోవాలి
• వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి బంగాళఖాతంలో పడేయాలి
• సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలి
addComments
Post a Comment