మరో 2 నెలల్లో ప్యాపిలిలో ఇంటింటికి తాగునీరు.






*మరో 2 నెలల్లో ప్యాపిలిలో ఇంటింటికి తాగునీరు


*


*డోన్ నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకూ కొత్త రోడ్లు*


*ప్యాపిలిలో రూ.5.5కోట్లతో నిర్మించిన రహదారులను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*మునిమడుగు, అలేబాద్, అలేబాద్ తాండ, గార్లదిన్నె గ్రామాల ప్రజలతో కలిసి మంత్రి పాదయాత్ర*


ప్యాపిలి, నంద్యాల జిల్లా , అక్టోబర్,17 (ప్రజా అమరావతి); డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

ప్యాపిలిలోని రూ.5.5 కోట్లతో నిర్మించిన సరికొత్త రహదారులను ఆయన మంగళవారం ప్రారంభించారు.  గార్లదిన్నె నుంచి అలేబాదు వరకు రూ.3 కోట్ల నిధులతో 4 కి.మీ మేర కొత్త రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. మునిమడుగు నుంచి అలేబాదు తండా వరకు రూ.2.5కోట్లతో 5 కి.మీ మేర నూతన రహదారిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాదయాత్ర చేస్తూ ముందుకు సాగారు. ప్యాపిలి ప్రారంభోత్సవాల పర్యటనలో భాగంగా మునిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం  శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గార్లదిన్నె, మునిమడుగు, అలేబాదు, అలేబాదు తాండ ప్రజలతో కలిసి నడుస్తూ ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 


నీటి సమస్య త్వరలోనే తొలగిపోతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భరోసా ఇచ్చారు. వర్షం వచ్చినా రాకున్నాఇబ్బంది కలగని విధంగా డిసెంబర్ కల్లా పైప్ లైన్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్యాపిలిలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తామన్నారు. అలేబాద్ గ్రామంలోని సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆప్యాయంగా పలకరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,  వ్వవసాయ సలహా మండలి జిల్లా సభ్యులు మెట్టు వెంకటేశ్వరెడ్డి, జెడ్పీటీసీ శ్రీరామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ భువనేశ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి, అలేబాద్ తాండ గ్రామ సర్పంచ్ పరమేష్ నాయక్, ఎంపీటీసీ. సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య , కో ఆపరేటివ్ సభ్యులు సీమ సుధాకర్ రెడ్డి, ఎంఆర్వో చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.



Comments