దేశం మొత్తం అనుకరించేలా ఏపి స్టేట్ విజన్ ప్లాన్-2047.

 *దేశం మొత్తం అనుకరించేలా ఏపి స్టేట్ విజన్ ప్లాన్-2047


*

*•ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబందించి పలు అంశాలపై ఫలవంతగా చర్చలు జరిగాయి*

*•పలు రంగాల్లో కీలక మార్పులు, సంస్కరణలకు అవసరమైన ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందజేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు*

*•మరో వారం రోజులపాటు సీనియర్ లీడర్ షిప్, వర్కుషాపులో పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ ఇంటెన్సివ్ రౌండ్  చర్చలు*

*నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా*

                                                                                                                                                                                   అమరావతి, అక్టోబరు 27 (ప్రజా అమరావతి):  దేశం మొత్తం ఏపి స్టేట్ విజన్ ప్లాన్-2047 ను అనుకరించేలా అద్బుతమైన విజన్ డాక్యుమెంట్ ను  రూపొందించాలని  నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు.  రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న వర్కుషాపు ఎంతో అద్బుతంగా జరిగిందని, ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబందించి పలు అంశాలపై ఈ వర్కుషాపులో ఎంతో ఫలవంతగా చర్చలు జరిగాయన్నారు. పలు రంగాల్లో అపరిమితమైన మార్పులను తీసుకు వచ్చే విధంగా ఎంతో తెలివైన, విలువైన ఆలోచనలను పలువురు అందజేశారని ఆమె అభినందించారు. ఏపి స్టేట్ విజన్ ప్లాన్-2047 పై మరింత మేథోమథనం జరిగేలా మరో వారం రోజులపాటు సీనియర్ లీడర్ షిప్ మరియు వర్కుషాపులో పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ ఇంటెన్సివ్ రౌండ్  చర్చలు జరుపుతామని ఆమె తెలిపారు.  గత మూడు  రోజుల నుండి రాష్ట్ర సచివాలయంలో జరుగుచున్న నీతి ఆయోగ్ వర్కుషాపు  గురువారం   రాష్ట్ర విద్యా రంగంపై సుదీర్ఝ చర్చ అనంతరం ముగిసింది.   ఈ వర్కుషాపు  ముగింపు సందర్బంగా ఆమె మాట్లాడుతూ  విద్యా రంగానికి సంబందించి నేటి వర్కుషాపులో అద్బుతమైన చర్చలు జరిగాయన్నారు.   ప్రస్తుతం మరియు  భవిష్యత్తులో  ప్రపంచ వ్యాప్తంగా సంభవించే పలు కీలక మార్పులు, సంస్కరణలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన పలు సంస్కరణలకు సంబందించి ఎంతో మంది విద్యా వేత్తలు, మేథావులు పలు  సూచనలు, సలహాలు అందజేశారన్నారు. అయితే వాటన్నింటినీ అమలు పర్చాలంటే కేంద్ర స్థాయిలో ఉన్న పలు విద్యా సంస్థల్లో వ్యవస్థాగతంగా ఎన్నో కీలక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.  వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి అమలుకు తమ వంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు. 

                                                                                                                                                                              అంతకు ముందు జరిగిన మూడో రోజు వర్కుషాపులో  భాగంగా  విద్యా రంగానికి సంబందించి సుదీర్ఝ చర్చలు జరిగాయి.  ఈ సందర్బంగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింటే ప్రజంటేషన్ ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా  రాష్ట్ర  పాఠశాల విద్యా విభాగంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలను వివరించారు.  రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, అక్షరాశ్యతా శాతం పెంపుతో పాటు  రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల  శిక్షణలను  ప్రాథమిక స్థాయి నుండే అందజేస్తున్న విషయాన్ని ఆయన వివరించారు. అదే విధంగా రాష్ట్ర విద్యా రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన వివరించారు.  ఏపి స్టేట్ విజన్ ప్లాన్-2047 లో భాగంగా  పాఠశాల విద్యా విభాగం యొక్క లక్ష్యాలు, వాటి సాధనకు అమలు చేయనున్న  వ్యూహాత్మక ప్రణాళికలను ఆయన వివరించారు.  

                                                                                                                                                                                                  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమ చంద్రారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ఉన్నత విద్యా విభాగంలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను, లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి లక్ష్యాలైన నాణ్యమైన అభ్యాసం, నైపుణ్యాలు, సామర్థ్యాల పెంపు, సామాజిక స్పృహ, ఉపాధి & వ్యవస్థాపకత మరియు ప్రపంచ పౌరసత్వం  సాధనకు అమలు చేసే కార్యాచరణ ప్రణాళికలను ఆయన వివరించారు. 


రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ & స్కిల్ డవలెప్మెంట్ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏపి స్టేట్ స్కిల్ డవలెప్మెంట్ కార్పొరేషన్, సాంకేతిక విద్య, ఉపాధి & శిక్షణ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ & ఎంటర్ప్రెన్యూర్స్ డెవలెప్మెంట్ సొసైటీ మరియు నేషనల్  అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC) తదితర విభాగాల లక్ష్యాలను మరియు వాటి సాధనకు అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను వివరించారు. 

                                                                                                                                                                                 తదుపరి  విద్యా రంగానికి సంబందించి ఈ వర్కుషాపులో పాల్గొన్న పలువురు  ఉన్నతాధికారులు, విద్యా వేత్తలు, మేథావులు మాట్లాడుతూ విద్యా రంగం సమగ్ర అభివృద్దికి, విద్యార్థులు, ఉపాద్యాయుల సామర్థ్యం, నైతిక విలువల పెంపుకు, మౌలిక వసతుల మెరుగు, సామాజిక ప్రమేయం కల్పించేందుకు అవసరమైన పలు సూచనలు, సలహాలను అందజేశారు. 


 నీతి అయోగ్ డి.ఎం.ఇ.ఓ. డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ఏపిఎస్ఎస్డిసి సిఇఓ & ఎం.డి. డా.వినోద్ కుమార్, సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణి,  ఎస్.సి.ఇ.ఆర్.టి. డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా శాఖ డైరెక్టర్ ఎం.సుదర్శనమ్, పలువురు విద్యా వేత్తలు, మేథావులు తదితరులతో పాటు  నీతి ఆయోగ్ సలహాదారులు సిహెచ్. పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు  అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సెల్టెంట్ శైలీ మణికర్,  పర్యవేక్షణ & మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధి అభిషేక్ తదితరులు ఈ వర్కుషాపులో పాల్గొన్నారు. 

                                                                                                                                                                                                         

Comments