రూ.6 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్న ఆలయాల పనుల పురోగతిపై ఆరా.





*డోన్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష*


*బేతంచెర్లలో మంత్రి బుగ్గనతో సమావేశమైన జిల్లా డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్*


*రూ.6 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్న ఆలయాల పనుల పురోగతిపై ఆరా


*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, అక్టోబర్, 17 (ప్రజా అమరావతి); ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్లలోని తన క్యాంపు కార్యాలయంలో డోన్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.రూ.6 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్న ఆలయాల పనుల పురోగతిపై దేవాదాయ శాఖ  జిల్లా డిప్యూటి కమిషనర్ గురుప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్యాపిలి మండలంలో రూ.1.74 కోట్లతో కంబగిరి స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రూ.1.90 కోట్లతో డోన్ మండలంలో జరుగుతున్న గుండాల చెన్నకేశవస్వామి క్షేత్రానికి సంబంధించిన పనుల పురోగతిని మంత్రికి వివరించారు. రూ.1.50 కోట్లతో సాగుతున్న బేతంచెర్ల ఆంజనేయ స్వామి గుడి నిర్మాణ పనులను గురించి వివరించారు. ఏఏ దశల్లో పనులు సాగుతున్నాయో ఫోటోల ద్వారా మంత్రి బుగ్గనకు వెల్లడించారు. డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్ గురు ప్రసాద్ కాసాపురం ఆంజనేయస్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. అనంతరం పట్టు వస్త్రంతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్ గురు ప్రసాద్, మద్దిలేటి నరసింహస్వామి ఆలయ ఈవో పాండురంగా రెడ్డి, డిప్యూటి ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Comments