బంగారుకొండ కార్యక్రమం ద్వారా సానుకూల ఫలితాలు.



రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


*  బంగారుకొండ కార్యక్రమం ద్వారా సానుకూల ఫలితాలు



దత్తత తీసుకున్న పిల్లల్లో 393 సాధారణ స్థితికి చేరుకున్నారు 


రేలంగి ఇవాంశిక ఇంటికి వెళ్లి  బంగరుకొండ కిట్ అందచేత



.. కలెక్టరు మాధవీలత 



 జిల్లాలో ప్రయోగత్మకంగా అధికారులు,  ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం ద్వారా మూడు నెలల్లో 393 మంది పిల్లలు సాధారణ స్థితికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.



మంగళవారం సాయంత్రం స్థానిక ఐదు బండ్ల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి ఇవాంశిక నివాసానికి కలెక్టరు వెళ్లి బంగారుకొండ కిట్ అందచేశారు.


ఈ సందర్భంగా ఇవాంసిక ఆరోగ్య పరిస్థితి, ఎదుగుదల కు సంబందించిన వివరాలు తెలుసుకున్నారు.  గత నెల రోజుల్లో 9.5 కేజీల నుంచి 10.8 కేజీల బరువు, 2 సెంటిమీటర్ల ఎత్తు పెరిగిందని ఐ సి డి ఎస్ అధికారులు వివరించారు. 



 ఈ సందర్భగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని, బాలామృతం, కోడుగ్రుడ్లు, తో పాటు  జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం గా "బంగారుకొండ" అధికారుల , ప్రజల భాగస్వామ్యం తో చేపట్టడం జరిగిందన్నారు. 



  పౌష్టికాహార లోపం ఉన్న రేలంగి ఇవాంశిక వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, రక్త హీనత కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ క్రమంలో  పాపకు  పౌష్టికాహారానికి అదనంగా  అందించడం తో డాక్టర్ల సలహా మేరకు తగిన విధంగా పర్యవేక్షణ చెయ్యడం వల్ల  బరువు పెరగడం తో పాటు రెండు సెంటీమీటర్ల ఎత్తు పెరగడం  గమనించామన్నారు.


  బంగారు కొండ కార్యక్రమం ప్రక్రియలో భాగంగా జిల్లాలో  1283 మందిని గుర్తించి కిట్స్ అందచేశా మన్నారు. ఇప్పటి వరకు 393 మంది పిల్లలు సాధారణ ఎదుగుదల కు చేరుకోవడం జరిగిందని అన్నారు.



కలెక్టర్ వెంట ఐ సి డి ఎస్ పిడి  కె. విజయ కుమారి, ఇతర అధికారులు, సిబ్బంది వున్నారు.


Comments