బాలికలు బంగారు భవిష్యత్తుకు, భద్రతకు బరోసా కల్పిద్దాం.బాలికలు బంగారు భవిష్యత్తుకు, భద్రతకు బరోసా కల్పిద్దాం.


 రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ఛైర్మన్... కేసలి అప్పారావు

              


విజయనగరం, అక్టోబరు 11 (ప్రజా అమరావతి):

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు అధ్యక్షతన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం లో అన్ని శాఖల సమన్వయంతో ర్యాలీ మరియు మానవ హారం కార్యక్రమం ఘనంగా జరిగాయి .

ఈ సందర్భంగా చైర్మన్ అప్పారావు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్  వారు బాలికలు హక్కుల పరిరక్షణ కోసము నిరంతరం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు, అనధికారులు,ప్రజా ప్రతినిదులు, స్వచ్ఛంద సంస్థలు, బాలలుతో బాలలు కోసము పనిచేసే సంస్థలు, సంఘాలు మొదలగు అందరి సూచనలు సలహాలు సమన్వయం మరియు భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికోసం ప్రత్యేకంగా రూపొందింబడిన చట్టాలను పథకాలను పర్యవేక్షిస్తూ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ముఖ్యంగా బాలికలుకు పూర్తి స్థాయిలో విద్యను మరియు ఆరోగ్యాని ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని  తద్వారా బాలికలు అందరూ తమ ఉన్నత  లక్ష్యాలను శిఖరాలును చేరుకుంటారని తెలిపారు.సమాజంలో 

బాలికలును అన్ని రంగాలలో భాగస్వామ్యం చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.బాలికలు అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకోకూడదని,సామజిక మాధ్యమాలుకు, మొబైల్ ఫోన్లు కు దూరంగా ఉండాలని వారు ఏర్పరచుకొన్న లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేయాలని ,నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.తల్లి దండ్రులు బాలికలు తో నిరంతరం చర్చిస్తూ ఉండాలని  వారి  బంగారు భవిష్యత్తుకు పూల బాటలు వేయాలని సూచించారు. రాష్ట్రములో బాలికలు అందరి భద్రతకు, రక్షణకు బరోసా కల్పించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించి రాష్ట్రాన్ని బాలల స్నేహ పూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 

జిల్లా ఇంటర్ మీడియట్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆదినారాయణ మజ్జి 

జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది కెంగువ. జయ లక్ష్మి, యాళ్ల. నాగరాజు, వెన్నెల.సంధ్య, రెడ్డి సరస్వతి,తవిటి నాయుడు,వెంకటరావు,అప్పారావు, వన్ స్టాప్ సిబ్బంది సాయి విజయ లక్ష్మి, చైల్డ్ లైన్ సిబ్బంది అరుణ్,అనిల్,మీనా,గౌరీ,

అంగన్వాడీ కార్యకర్తలు,మహిళా పోలీస్ సిబ్బంది,విద్యార్దులు పాల్గొన్నారు.

Comments