డోన్ పట్టణ ప్రజలకు మరింత చేరువైన చికిత్స.



*డోన్ పట్టణ ప్రజలకు మరింత చేరువైన చికిత్స


*


*డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన మంత్రి బుగ్గన*


*పాతపేట, రోకలిబండలో రూ.1.6 కోట్లతో  వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం*


*డోన్ లో  కూరగాయల మార్కెట్, నగరవనం, మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని రహదారి, క్లబ్ హౌస్ పనుల పరిశీలన*


*ఆర్.ఎస్ రంగాపురంలో మద్దిలేటి స్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన*


డోన్, నంద్యాల జిల్లా,16 (ప్రజా అమరావతి); డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డోన్ పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి చికిత్సను మరింత చేరువ చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.  పట్టణంలోని పాతపేట. రోకలిబండ సత్రం ప్రాంతాలలో రూ.1.6 కోట్లతో నిర్మించిన  డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు ఆయన స్పష్టం చేశారు. డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్ తో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో కలిసి  సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తొలుత పాతపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవం అనంతరం స్థానిక ప్రజలతో గ్రీవెన్స్ నిర్వహించారు. వారి ఫిర్యాదులను స్వీకరించి అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలిచ్చారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముచ్చటించారు. కొత్త కార్యాలయ భవనంలో ప్రజలకు మరింత సమర్థవంతంగా వైద్య సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.  మున్సిపల్ ఛైర్మన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. పాత బస్టాండ్ వద్ద ప్రారంభించిన యూపీహెచ్ సీలో స్థానిక  ప్రజలు మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించారు. డోన్ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చడంలో మంత్రి బుగ్గన నిరంతరం చేసిన కృషిని మరచిపోమని , నలభై ఏళ్లలో లేని అభివృద్ధిని  నాలుగేళ్లలో చేసి చూపారని వారు స్పష్టం చేశారు. 


అనంతరం బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియం పక్కన నిర్మిస్తోన్న క్లబ్ హౌస్ పనులను మంత్రి పరిశీలించారు. దాని ఎదురుగా  మున్సిపల్ కార్యాలయ భవనంలోకి వెళ్లే రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.  ఆ తర్వాత రూ.7.6 కోట్లతో నిర్మిస్తోన్న కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను మంత్రి ఆదేశించారు. అంతకు ముందు పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి బేతంచెర్ల నుంచి డోన్ కు వస్తున్న సమయంలో నగరవనాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సందర్శించారు. అడ్మిన్ బ్లాక్, సందర్శకులకు కావలసిన వసతి ఏర్పాట్ల పనులను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  బేతంచెర్ల ఆర్ ఎస్ రంగాపురంలోని మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ రహదారిలో రూ.2.75 కోట్లతో గ్రానైట్ తో నిర్మించే ఆలయ ముఖ ద్వారానికి సంబంధించిన పనులను పరిశీలించారు. రూ.12.70 కోట్లతో నిర్మించనున్న మహా ప్రాకార మండప నిర్మాణం, స్వామి వారి పాద మండపం, గోపురం సహా మొత్తం రూ.40 కోట్లతో చేపట్టిన ఆలయ పున:నిర్మాణ పనులపై ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, కాంట్రాక్టర్ లకు మంత్రి బుగ్గన పలు ఆదేశాలిచ్చారు. క్రమ పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి నరసింహస్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, తహసీల్తార్ నరేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్ , ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, ఆర్డీవో వెంకట రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.



Comments