సఫాయికార్మికుల సంక్షేమానికి కృషి .


                

                     

                   

                  


సఫాయికార్మికుల సంక్షేమానికి కృషి 



పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మీ    


   విజయవాడ (ప్రజా అమరావతి);

రాష్ట్రంలోనిపారిశుద్ధ్యకార్మికులు, స్కావెంజర్ల సంక్షేమానికి ప్రభుత్వంఅధికప్రాధాన్యతనిస్తోందనిరాష్ట్రపురపాలక,పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శివై శ్రీలక్ష్శీ తెలిపారు. 


సమాజంలో అందరితో సమానంగా వారికి గుర్తింపు, ఆత్మ గౌరవం పెంపొందించడమే ప్రభుత్వధ్యేయమని, ఆదిశగా వారిసంక్షేమానికి అడుగులు వేస్తున్నామన్నారు.


 స్కావెంజర్లు అనారోగ్యాల బారిన పడకముందే వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు

తీసుకుంటుందన్నారు.


గురువారం  తాడేపల్లి పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ సమావేశమందిరంలో జరిగిన పారిశుద్ద్యకార్మికుల సంక్షేమం,అభివృద్ధిపైస్వచ్చాంధ్ర కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో శ్రీ లక్ష్శీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.



క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తడి,పొడి చెత్త విషయంలో ప్రజల సహకారం  సరిగా లేకపోవడం వల్లచెత్తనువేరుచేసేందుకుపారిశుద్ధ్యకార్మికులుఇబ్బందులుపడుతున్నారన్నారు


కరోనాపై వచ్చినట్టుగానే పారిశుద్ధ్యం నిర్వహణ

సఫాయి కార్మికుల విషయంలో కూడాప్రజల్లోమార్పురావాల్సిన అవసరంఉందనిశ్రీలక్ష్మీతెలిపారు.  మాన్యూవల్  స్ధానంలో  యంత్రాలను వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలనిఆమె సూచించారు.


స్వచ్చాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ దేశానికిస్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్ళ తర్వాతకూడా స్కావెంజర్లవ్యవస్ధకొనసాగడంభాధాకరమన్నారు.  రాష్ట్రంలోని సఫాయికార్మికుల సంక్షేమం,అభివృద్ధికిముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రత్యేకశ్రద్దకనబరుస్తున్నారన్నారు.


తమ ప్రాణాలను పణంగా పెట్టి సఫాయి కార్మికులు చేసిన సేవలు ఈ సమాజంఏమిచ్చినా తీర్చుకోనివని గంధం చంద్రుడు చెప్పారు.. మురికి వాసనను, క్రిముల దాడులను తట్టుకొని ఆ బాధను అనుభవిస్తూ ప్రజలను కాపాడే దేవదూత లు పారిశుధ్య కార్మికులని ఆయన కొనియాడారు.


చెత్తాచెదారం,పారేసినతినుబండారాలు, ప్లాస్టిక్‌, రకరకాల రసాయనాలు,చివరికిఅశుద్ధాన్ని నింపుకొని పారుతున్న మోరీలనుశుభ్రపరిచేపనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు శ్లాఘనీయమన్నారు.


 ఎవరి మలినాన్ని వారు శుభ్రం చేసుకోవడానికి ఇబ్బంది పడే మనుషులు తమందరి మలినాలన్నీ ఎత్తి పోసేవారిని మాత్రందూరంగానేఉంచుతున్నారని వారి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గంధం చంద్రుడుఉద్ఘాటించారు.


రకరకాలుగా సామాజికంగా అవమానాలకుగురవుతున్నపారిశుద్ద్యకార్మికులనుకనీసంముట్టుకోవడానికి సైతం ఇష్టపడని మనం,నిజంగావారిసేవలనుగుర్తిస్తున్నామాఅనిప్రతిఒక్కరుఆలోచించాలన్నారు. 


సమాజమలినాన్నిఅంతాపారదోలి, ఇక సుఖించడం మీ వంతు అని మనల్ని దీవిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులని గంధం చంద్రుడుప్రశంసించారు.


పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ సామాజిక పరిశుభ్రత అనేది ఎవరిఇండ్లనువారుపరిశుభ్రంగా ఉంచడంపైన ఆధారపడి ఉం టుందన్నారు. కొంతవరకు ఆయా ఇంటి వారి బాధ్యతగా ఉన్నప్పటికీ, వ్యవస్థాగతంగా, సామాజికంగా చేయాల్సిన కృషి ఎంతో ముఖ్యమైనదని ఆయన చెప్పారు.


 పారిశుధ్యకార్మికులేపనిచేయకుంటే ప్రదేశాలన్నీ మురికి కూపంగా మారుతాయి. అవే వ్యాధులకు క్రిములకు కేంద్రాలుగా మారి రోగాలు వ్యాపిస్తాయన్నారు. ముఖ్యంగా మరు గు దొడ్లను శుభ్రం చేసే కష్టతరమైన పనినిఈపారిశుధ్య కార్మికులేచేయడంశోచనీయమన్నారు.


మ్యాన్‌ హోల్‌లోకిదిగినసఫాయి కార్మికులుఎంతోమందిమృత్యువాతపడినఉదంతాలుఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఏటా వందల మంది సఫాయికార్మికులుమ్యాన్‌హోల్‌లో దిగి విషవాయువుల ప్రభావంతో చనిపోతున్నారని రాజశేఖర్ తెలిపారు.. పారిశుధ్యపనులకుయంత్రాలను వినియోగించటం తప్పనిసరి చేయాలన్నారు.


సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మీ,పంచాయి తీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్,సూర్యకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ చిన్నరాముడు, సఫాయి కార్మిక ఆందోళన్ ప్రతినిధి విల్సన్  తదితరులుఈ సమావేశంలో ప్రసంగించారు. సమావేశంలో పాల్గొన్న పలు స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు

పారిశుద్ద్య కార్మికుల సంక్షేమం కోసంచేపట్టవలసిన కార్యక్రమాలపై ప్రభుత్వానికి

పలు సూచనలు చేశారు.

Comments