జగనన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి.
నంద్యాల జిల్లా  (ప్రజా అమరావతి);
  మా కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించండి అంటూ ఈ దినం (03-10-2023) కొన్ని   దినపత్రికలో వచ్చిన వార్తలను గురించి పూర్తి వాస్తవాలతో కూడిన వివరాలు తెలియజేయడమైనది.


తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయం దగ్గర ఓ కారు కలకలం రేపింది.  వైఎస్సార్‌సీపీ వాళ్లు తన రూ.16 కోట్ల విలువైన ఆస్తి మోసం చేసి దోచుకున్నారంటూ ఓ వ్యక్తి పోస్టర్లు అంటించి కారును అక్కడే వదిలేశాడు. 'జగనన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి.


న్యాయం చేయ లేకపోతే మేం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి. నన్ను మోసం చేసిన వ్యక్తి ఇతనే.. మీ పార్టీ ఎమ్మెల్యే గంగుల నానితో మీతో ఆ వ్యక్తి దిగిన ఫొటోలివిగో..' అంటూ కారుపై అతికించి, తన మొబైల్‌ నంబరును కూడా ప్రస్తావించి కారును బాధితుడు సిద్ధం రెడ్డి రమణారెడ్డి S/O S. అక్కిరెడ్డి వయసు 47 సంవత్సరములు అనే వ్యక్తి వదిలేసి వెళ్లారు. సదరు కారు నెంబర్ TS 07 GG 8693 రెనాల్ట్ కార్. 


రమణారెడ్డి తండ్రిగారైన అక్కిరెడ్డి గారికి “శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీస్ ‘’లో 10 శాతం వాటా ఉంటే ఆ విషయంలో భాగ పరిష్కారాల విషయంలో రమణారెడ్డికి అన్యాయం జరిగిందని, దానికి కారణము వారి గ్రామానికి చెందిన వారి బంధువులైన మల్లికార్జున్ రెడ్డి కారణమని ఆయన ఉద్దేశ్యము.

 

దీనికి సంబంధించి 8.7.2022 తేదీన రమణారెడ్డి ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 117/2022 U/S 420 IPC కేసుగా నమోదు అయి ఈ విషయంలో విచారణ చేసి ఇది పూర్తి కుటుంబ భాగ పరిష్కార సమస్య అని, ఈ కేసు పూర్తిగా తప్పుడు కేసుగా విచారణ లో తేలింది . 

 ఈ విషయం ఇప్పటికే నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కొర్టు లో O.S.No.585/2021 గా పెండింగ్ లో ఉన్నదని., అదేవిధంగా ఈ కేసు కోర్టు  నందు పెండింగ్ లో  ఉన్నందున ఉభయ పార్టీలు ఈ కేసును కోర్టులో  పరిష్కరించ కొనవలెనని కూడా తెలపడం అయినది. అలాగే రమణారెడ్డి ఇచ్చిన’’ స్పందన’’ ఫిర్యాదులు కూడా పూర్తిగా విచారించినాము. 


ఈ విషయం రమణారెడ్డి అతని అన్న భాస్కర్ రెడ్డి కి సంబంధించి, అన్నదమ్ముల ఆస్తి పంపకములు సమస్యగా కోర్టులో పెండింగ్ ఉన్న సమస్యగా  గుర్తించి అదే విషయాన్నికోర్టులో పరిష్కరించుకోవాలని  తెలియజేశాము.


 అంతేకాక రమణారెడ్డి ఫిర్యాదులు  పంపుతాడు కానీ విచారణకు సరిగ్గా  సహకరించడని  కూడా గుర్తించినాము. విచారణ  సందర్భంగా ఈ కేసును కోర్టులో పరిష్కరించుకుంటానని ఉభయ పార్టీలు కూడా తెలియజేశారు.

రమణారెడ్డి  ఇచ్చిన  ఫిర్యాదు విషయములో గాని , స్పందనలో ఇచ్చిన పిటిషన్ల విషయంలో గానీ తక్షణము స్పందించినామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము . 


Comments