బాలిక‌ల ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌.

 *బాలిక‌ల ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌


*


*యుక్త‌వ‌య‌సులో ప‌రిశుభ్ర‌త ఎంతో అవ‌స‌రం*


*సీఎం వైఎస్ జ‌గ‌న్ స్ఫూర్తితో ముంద‌డుగు*


*కింబెర్లీ- క్లార్క్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉచితంగా నాప్‌కిన్లు*


*అంత‌ర్జాతీయ బాలికా దినోత్స‌వం సంద‌ర్భంగా కార్య‌క్ర‌మం ప్రారంభం*


*దేశంలోనే తొలి సారి ఏపీ నుంచే నాప్‌కిన్లు పంపిణీ చేస్తున్న కింబెర్లీ- క్లార్క్ సంస్థ‌*


*తొలివిడ‌త‌లో ఉచితంగా 2.33ల‌క్ష‌ల పాడ్ల పంపిణీకి చ‌ర్య‌లు*


*విడ‌త‌ల వారీగా మరిన్ని పాడ్ల పంపిణీకి ఏర్పాట్లు*


*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*


మంగళగిరి, గుంటూరు జిల్లా:అక్టోబర్ 11 (ప్రజా అమరావతి);

త‌మ ప్ర‌భుత్వం బాలిక‌ల ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ముందుకు సాగుతోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. ప్ర‌పంచ బాలిక‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ ఆధ్వ‌ర్యంలో  కిశోర బాలిక‌ల‌కు బుధవారం ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్స్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. వైద్య ఆరోగ్య‌శాఖ విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ సంస్థ 2.33 ల‌క్ష‌ల శానిట‌రీ నాప్‌కిన్లు, 297 కేసుల డైప‌ర్ల‌ను తొలివిడ‌త‌లో పేద విద్యార్థులు, చిన్నారుల‌కు అంద‌జేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఆ మేర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు సంబంధిత శానిట‌రీ నాప్‌కిన్లు, డైప‌ర్ల‌ను అంద‌జేసింది. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం లో బుధవారం నిర్వహించిన ఈ కార్య‌క్ర‌మానికి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో చ‌దువుతున్న ఏడో త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి లోపు ఆడ‌పిల్ల‌ల‌కు త‌మ ప్ర‌భుత్వ స్వేచ్ఛ కార్య‌క్ర‌మం కింద నెల నెలా 12 ల‌క్ష‌ల శానిట‌రీ నాప్‌కిన్ల‌ను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 2021 అక్టోబ‌ర్ 5న ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారన్నారు. రుతుక్ర‌మ స‌మ‌స్య వ‌ల్ల ఆడ‌పిల్ల‌లు పాఠ‌శాల‌కు రాకుండా ఉండ‌కూడ‌దనే ఉద్దేశంతో జ‌గ‌న‌న్న ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించార‌న్నారు. ఎంత ఖ‌ర్చ‌యినా త‌మ ప్ర‌భుత్వం శానిట‌రీ నాప్ కిన్ల పంపిణీని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్న‌ద‌ని ఆమె చెప్పారు. దీనివ‌ల్ల విద్యార్థుల‌కు ఎంతో మేలు జ‌రుగుతోంద‌న్నారు. చిన్న వ‌య‌సులో ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డం వ‌ల్ల బాలిక‌ల ఆరోగ్యం మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌ని, భ‌విష్య‌త్తులో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా కాపాడుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. ఈ ప‌థ‌కంలో భాగంగా మ‌రింత‌గా బాలిక‌ల‌కు మేలు చేసేందుకు కింబెర్లీ- క్లార్క్ లాంటి సంస్థ‌లు ముందుకు రావ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఈ సంస్థ భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీకి స‌హ‌క‌రించ‌నుంద‌ని చెప్పారు. 

*సీఎం జ‌గ‌న్ ఆశ‌య సాధ‌నే ల‌క్ష్యంగా*

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆశ‌యాలను మ‌రింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్న‌ట్లు మంత్రి రజనీ తెలిపారు. కింబెర్లీ- క్లార్క్ సంస్థ మ‌న దేశంలోనే తొలిసారిగా ఏపీ నుంచి శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చెందిన పేద విద్యార్థినుల ఆరోగ్యం కోసం త‌మ ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని తెలిపారు. పౌష్టికాహారం పంపిణీ, ర‌క్త‌హీన‌త నివార‌ణ చ‌ర్య‌లు, శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ.. లాంటి చ‌ర్య‌ల వ‌ల్ల విద్యార్థినుల‌కు ఎంతో మేలు చేస్తున్న ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం అని మంత్రి రజనీ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ  సిఇవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ , నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎం డాక్టర్ వెంకటరవి కిరణ్, చైల్డ్ హెల్త్ జెడి డాక్టర్ అర్జునరావు , కింబెర్లీ- క్లార్క్

సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments