ఏ. పి. ఎస్. ఆర్టీసీ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనం. .

 విజయవాడ (ప్రజా అమరావతి);ASRTU నిర్వహించిన అఖిల భార‌త ప్రజా ర‌వాణా సంస్థల ఆటల పోటీల్లో 

సత్తా చాటిన  ఏ. పి.,ఎస్. ఆర్. టి. సి. ఉద్యోగులు

ఏ. పి. ఎస్. ఆర్టీసీ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనం  


గుజరాత్ వేదికగా ASRTU ఆధ్వర్యంలో  జరిగిన పోటీలు 

షెటిల్ బాడ్మింటన్ డబుల్స్ లో ఏ. పి.,ఎస్. ఆర్. టి. సి. కి ప్రధమ స్థానం కైవసం 

గెలిచిన ఆటగాళ్లను అభినందించిన సంస్థ ఎం. డి. శ్రీ ద్వారక తిరుమలరావు, IPS  

ఉద్యోగులు మాన‌సికోల్లాసానికి ఆటలు, క్రీడలు దోహదపడతాయని కితాబు  

అన్ని రాష్ట్రాల ఆర్టీసీల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో ముగిసిన పోటీలు 

ASRTU ఆధ్వర్యంలో, GSRTC సౌజన్యంతో అహ్మదాబాద్ లో జరిగిన ‘అఖిల భార‌త ప్రజా  ర‌వాణా సంస్థల వాలీబాల్ మరియు షటిల్ బాడ్మింటన్ టోర్నమెంట్‌-2023' లో ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. ఉద్యోగులు సత్తా చాటారు. 3 రోజుల పాటు జరిగిన  ఈ టోర్నమెంట్ లో షెటిల్ బాడ్మింటన్ డబుల్స్ విభాగంలో  ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు ప్రధమస్థానంలో నిలిచారు.  

హెడ్డాఫీసు ఐ. టి. విభాగం అధికారి శ్రీ సాయి చరణ్ తేజ్ (అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్) మరియు నూజివీడు డిపో కండక్టర్ శ్రీ రమేష్ ఇరువురూ షెటిల్ బాడ్మింటన్ డబుల్స్ లో టైటిల్ గెలుపొందారు. 

    

3 రోజులుపాటు జరిగిన అన్ని మ్యాచ్ లలో చక్కటి ప్రతిభ కనబరచి గెలిపొందారు. అనంతరం గుజరాత్ ఆర్టీసీ ఎం. డి. మరియు ASRTU అధికారుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. 

ఈ పోటీలలో షెటిల్ బాడ్మింటన్ తో పాటు వాలీబాల్ జట్టు కూడా పాల్గొన్నది. ఆ జట్టు కూడా మంచి ప్రతిభ కనబరిచింది.  

గత నెలలో ఏ. పి. ఎస్. ఆర్. టి. సి తరపున ఈ పోటీలలో పాల్గొన్న ఆటగాళ్ళను హెడ్డాఫీసు కమిటీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన ఉద్యోగులకు ఆయా ఆటల కోచ్ ల సమక్షంలో గత నెల 28 న మున్సిపల్ స్టేడియంలో వాలీబాల్ మరియు 29 న ఇండోర్ స్టేడియంలో షెటిల్ బాడ్మింటన్ సెలక్షన్స్ నిర్వహించి ఎంపిక చేయడం జరిగింది. అనంతరం ఎంపికైన వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి     అహ్మదాబాద్ పంపడం జరిగింది. 

కాగా, పోటీలలో గెలిచిన ఉద్యోగులను ఈ రోజు అనగా 03.10.2023. తేదీన  సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు, ఐ. పి. ఎస్. గారు తన ఛాంబర్ నందు గెలిచిన ట్రోఫీని అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ఇక ముందు జరగబోయే పోటీలకు కూడా ఏ. పి. ఎస్.ఆర్.టి.సి. ఉద్యోగులను ప్రోత్సాహిస్తామని ఈ సందర్భంగా ఎం. డి. తెలియజేశారు.  అన్ని ఆర్టీసీలను ఒకే వేదికపై ఒక చోట చేర్చి స్నేహపూర్వక వాతావరణంలో “కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) ఇటువంటి టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమ”ని సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు, ఐ. పి. ఎస్. తెలిపారు. చివరగా ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో అంకిత‌భావ సేవ‌లు అందించడమే కాకుండా, మంచి పోటీతత్వంతో ఈ టోర్నమెంట్ గెలిచి ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. ఘనత చాటి చెప్పారని కొనియాడారు. 

 సెలక్షన్స్ లో మరియు ప్రత్యేక శిక్షణ ఇచ్చినందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, కోచ్ లకు తదితర సిబ్బందికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Comments