నిరుపేద కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ఆప‌న్న హ‌స్తం.*నిరుపేద కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ఆప‌న్న హ‌స్తం
*


*కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా 6 మందికి రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హాయం*


*జిల్లా క‌లెక్ట‌ర్ డా.జి.సృజన చేతుల మీదుగా చెక్కులు అందచేత*


*ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు*


కర్నూలు, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): నిరుపేద కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి ఆప‌న్న హ‌స్తం అందించారు..పేదలకు సాయం చేయడం లో తానెప్పుడూ ముందుంటానని  నిరూపించారు.కష్టాల్లో ఉన్న వారి బాధలు విని కరిగిపోయారు..


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వ‌ద్ద పలువురు తమ కష్టాలను చెప్పి, ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు. వెంటనే ఆర్థిక సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన కు ఆదేశాలు ఇచ్చారు... రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారులను పిలిపించి  శుక్రవారం  తన  కార్యాలయంలో 6 మంది బాధితులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అందించారు..లక్ష రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు అనారోగ్యం తో బాధపడుతున్న వారికి తదుపరి వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన దిశగా అవకాశాలు కల్పించేందుకు దృష్టి పెట్టామని కలెక్టర్ వివరించారు.


*వినతి పత్రాల వివరాలిలా..*


కౌతాళం మండలం, కామవరం గ్రామ నివాసి యు.అశోక్  పొలం పనులు చేసుకునే తనకు ఊపిరితిత్తుల్లో నీరు చేరినందున డాక్టర్లు ఆపరేషన్  చేయాలన్నారని, ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కి విన్నవించుకున్నారు.. 


ఎమ్మిగనూరు మండలం హెచ్.కైరవాడి గ్రామ నివాసి కురువ రాజు   2021 సంవత్సరంలో కూలిపనికి వెళ్ళినప్పుడు తన 6 సంవత్సరాల వయసులో  తన కూతురు విద్య అగ్ని ప్రమాదానికి గురి కాగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిందని, తన కుమార్తెకు పింఛను మంజూరు చేసి కూలి పనులు చేసుకుని జీవిస్తున్న  తన కుటుంబాన్ని ఆదుకోవాలని  ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు..  


ఎమ్మిగనూరు  నివాసి షేక్ రేష్మా తన కూతురు షేక్ యాస్మిన్ ఐదు సంవత్సరాల క్రితం  బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడి  దురదృష్టవశాత్తు రెండు కళ్ళు కోల్పోవడం జరిగిందని,  కూలి పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్న తమను ఆదుకోవాలని కోరుతూ  ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.


ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన బి.భాస్కర్  తన కుడి కాలుకు ఆపరేషన్ చేయించుకున్నానని,  మూడు లక్షల రూపాయలు ఖర్చు అయిందని, ఇప్పటికీ మందులు వాడుతున్నానని, వికలాంగ పెన్షన్ లేదా ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ  ముఖ్యమంత్రికి అర్జీ సమర్పించుకున్నారు..  


గోనెగండ్ల మండలం, పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన డి.ఖాజావలి తాను గత ఆరు సంవత్సరముల నుండి కిడ్నీ వ్యాధి, యూరిన్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్నానని,  ఇందుకోసం  ప్రతి నెల సుమారుగా రూ.10,000/-లు ఖర్చు అవుతున్నాయని, తనకు పెన్షన్ , ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు..


ఆదోని మండలం మండిగిరి పంచాయతీకి చెందిన గొల్ల లక్ష్మన్న తన  కుమార్తె శ్రావణి పుట్టుకతోనే మానసిక  జబ్బుతో బాధపడుతుందని,  ప్రతి నెలా సామాజిక పెన్షన్ రూపములో కేవలం రూ.3000/- లు మాత్రమే అందుతుందని, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు..


చెక్కులు అందుకున్న  ల‌బ్ధిదారులు ముఖ్య‌మంత్రి చేసిన స‌హాయానికి మ‌నసారా ధ‌న్య‌వాదాలు తెలిపారు.తమ బాధలు విని వెంటనే స్పందించి తమకు సాయం చేసిన గొప్ప మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటూ  కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.చెక్కులు అందించిన జిల్లా కలెక్టర్ కు కూడా లబ్దిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  డి ఆ ర్వో మధుసూదన రావు పాల్గొన్నారు.Comments