వార్షిక తనిఖీలలో భాగంగా పెద్దాపురం స్టేషన్ ను సందర్శించిన డిఐజి అశోక్ కుమార్ ఐపిఎస్ .

 వార్షిక తనిఖీలలో భాగంగా పెద్దాపురం స్టేషన్ ను సందర్శించిన డిఐజి అశోక్ కుమార్ ఐపిఎస్ 



కాకినాడజిల్లా ( పెద్దాపురం)  (ప్రజా అమరావతి): 


 ఏలూరు రేంజ్ డీఐజీ  జి వి జి అశోక్ కుమార్ ఐపిఎస్. వార్షిక తనిఖీ లో బాగంగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించరు సందర్భంలో  స్టేషన్ హౌస్ అధికారికి ఈ తనిఖీలో  ఈ క్రింది విధంగా సూచనలు చేయడం జరిగింది 

1. అండర్ఇన్విస్టిగేషన్ కేసు లలో ముఖ్యముగా 2020 సంవత్సరoకు ముందు వున్న కేసులలో ప్రత్యేక దృష్టి పెట్టమని సూచించారు. మరి ముఖ్యంగా హత్యా నేరం , ఎస్ సి &ఎస్టి ప్రత్యేక చట్టం, పోక్సో చట్టం క్రింద నమోదైన కేసులలో కూడా దర్యాప్తు త్వరిత గతిన పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అని సూచించారు.

2. చీటింగ్ , లాండ్ రిలేటెడ్ కేసెస్ లో సంబంధిత డిపార్ట్మెంట్స్ నుండి ఎంక్వయిరీ రిపోర్ట్స్ 91 సీఆర్ .పి సి ప్రకారం విధిగా తీసుకోవాలి త్వరిత గతిన దర్యాప్తు పూర్తి చెయ్యాలని సూచించారు.


3.పగటి మరియు రాత్రి ఇంటి దొంగతనాలు జరుగుతున్న ఏరియాలలో  ప్రత్యేకమైన శ్రద్ద కనపర్చి నేరాలు జరగకుండా ప్రజలకు అవగాహన పెంచి ఆయా  ప్రాంతాలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా సూచించాలని దీనికోసం కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్  అమలు చేస్తున్న వారధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని  సూచించారు.


4. ప్రాపర్టీ కేసెస్ త్వరితగతిన డిటెక్ట్ చేయ్యాలని దానికోసం ప్రతేకమైన టీమ్స్ ఏర్పాటు చెయ్యాలని టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలని సూచించారు.


5. సస్పెక్ట్స్ అందర్నీ విచారించి వారిలో యాక్టీవ్ పర్సన్స్ పై ప్రత్యేకమైన దృష్టిపెట్టాలని సూచించారు. రౌడీ షీట్ వున్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని 


6. 174 సి ఆర్ .పి సి . మరియు మిస్సింగ్ కేసులలో  సరైన కారణాలను కనుగొని కేసెస్ ను ఫైనలిజ్ చెయ్యాలని సూచించారు అన్ ఐడెంటిఫైడ్  డెడ్ బాడీస్ కేసెస్ లలో ప్రత్యేక శ్రద్ద పెట్టి ఐడెంటిటీ ట్రేసఔట్ చెయ్యాలని సూచించారు.


7. మిస్సింగ్ కేసెస్ లలో కంప్లైనంట్ ను రీ ఎక్సమినేషన్  చెయ్యాలని ఓదర్ టెక్నికల్ డేటా సపోర్ట్ తో డిటెక్ట్ చెయ్యాలని 

     

8. ఐటీ యాక్ట్ కేసు లలో టెక్నికల్ సపోర్ట్ను తీసుకుని నగదును రికవరీ చేయాలి


9. గ్రేవ్ పీటీ కేసు లను హెడ్ వైజ్ సిగ్రీగేషన్ చేసి ట్రైల్ త్వరగా కంప్లీట్ అయ్యి కన్విక్షన్స్ వచ్చేలా  శ్రద్ధ వహించాలి


10.ఎస్ సి &ఎస్ టి పీటీ కేసుల్లో  త్వరితగతిన గౌరవ న్యాయస్థానాలు ట్రైల్ కండక్ట్ చేసేలా చూసుకోవాలి


11. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పెద్దాపురం పారిశ్రామిక ప్రదేశాలలో పనిచేసే వారి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.


12. 302, 307,ఓదర్ గ్రేవ్ కేసెస్ లో ప్రత్యేకమైన శ్రద్ద కనబరచి శిక్షలు తీసుకొని రావాలని సూచించారు. కేసులలో రౌడీ షీట్స్ ఓపెన్ చేయడంతో పాటుగా  బైండోవర్ కూడా చేసుకోవాలి.


13. వరకట్న నిరోధక చట్టం క్రింద నమోదైన కేసులలో  దర్యాప్తు సహేతుకంగా ప్రామాణిక పద్ధతిలో పూర్తి చేయాలి.


14. సంక్షేమంలో భాగంగా స్టేషన్ సిబ్బంది అందరితో  ఇంటరక్ట్ అయ్యి వారికి ఆలౌట్ అయిన గ్రామాల వివరాలు మరియూ రౌడీలు వివరాలు అడిగారు ఏదైనా సమస్య వుంటే తనను సంప్రదించవచ్చని చెప్పారు..మరియు వారి యోగ క్షేమాలు తెలుసు కోవడం జరిగింది.


15. స్టేషన్ లో వున్న అన్ని రికార్డ్స్ తనిఖీ చేశారు..ప్రాపర్టీ ఆఫన్సెస్ లలో క్రాస్ రిఫరెన్స్ చూశారు. విలేజ్ హిస్టరీ షీట్స్ క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రధాన కేసులు మరియు అంశాలను నమోదు చేయాలని సూచించారు.


16. పీటీ కేసెస్ లో లాంగ్ పెండింగ్ కేసెస్ లలో పెండింగ్ లో ఉన్న ఎన్ బి డబ్ల్యూ ముద్దాయిల మీద దృష్టిసారించి వారిని పట్టుకొని తక్షణం ఎగ్జిక్క్యూట్ చేయాలని సూచించారు.


18. రౌడీషీట్ కలిగిన వ్యక్తులు నిందితులుగా వున్న కేసులలో స్పీడి ట్రయల్ కోర్టులలో జరిగేలా చర్యలు తీసుకోవాలి


20. దర్యాప్తు పూర్తి చేసుకున్న కేసులలో స్థానిక కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ లతో సమన్వయం చేసుకుని కోర్టులలో చార్జిషీట్ లను దాఖలు చేయాలి. 


21. రోడ్డు ప్రమాదాల కేసులలో గౌరవ సుప్రీం కోర్టు ఆదేశాలను అమలుచేసి నిర్దేశిత సమాచారాన్ని నియమిత కాల వ్యవధిలో మోటర్ వెహికల్ క్లైమ్స్ ట్రిబ్యునల్ కు పంపించడం జరగాలి.

 ఈ వార్షిక తనిఖీల్లో భాగంగా 

డిఐజి  వెంట జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్  అడిషనల్ ఎస్పీ పరిపాలన  పి శ్రీనివాస్ పెద్దాపురం డి ఎస్ పి  లతా కుమారి, పెద్దాపురం ఇన్స్పెక్టర్ రవి కుమార్ , సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ మరియు స్టేషన్  పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Comments