మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం.. -జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా.

 

కాకినాడ, అక్టోబర్ 28 (ప్రజా అమరావతి);


*మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం..

    -జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా.

 


రామాయణ మహాకావ్యాన్ని ఈ సమాజానికి అందించిన వాల్మీకి మహర్షి తన జీవిత కాలంలో పాప, పుణ్య కర్మలను ప్రక్షాళన చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి అని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా..శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ పట్టణ ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకట లక్ష్మి, అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమన్నారు. అడవుల్లో సంచరిస్తూ బోయవాడిగా జీవితం గడుపుతున్న వాల్మీకి మహర్షిగా తన జీవితాన్ని ములుచుకోవడమే కాకుండా ...అద్భుతమైన రామాయణ ఇతిహాసాన్ని సమాజానికి అందించడం ద్వారా సంస్కృత భాషలో ఆది కవిగా 

వాల్మీకి కీర్తి గడించారన్నారు. హిందూ ధర్మాలు, చరిత్ర, సంస్కృతి, నడవడిక, ఆచారాలు వంటి  అంశాలు రామాయణ మహాకావ్యం మానవులపై అనితరమైన ప్రభావం చూపిస్తుందని ఆమె తెలిపారు. వాల్మీకి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో పయనించాల్సిన అవశ్యకత ఉందని కలెక్టర్ తెలిపారు. 

    ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి దేశ చరిత్రతో సంబంధం ఉన్న పెద్దలు, దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసి అమూల్యమైన సేవలందించిన మరెందరో మహానుభావుల యొక్క కీర్తి ప్రతిష్టలు, వారి జీవిత విశేషాలు నేటి తరానికి తెలిసే విధంగా ప్రముఖల జయంతి, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. బోయవాడిగా జీవించే వ్యక్తి వాల్మీకి మహర్షిగా మారిన పరిణామ క్రమం మనందరి జీవితాలకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుందని ఆమె తెలిపారు. కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ తప్పుడు మార్గంలో పయణిస్తున్న వ్యక్తి తన తప్పును సరిదిద్దుకొని మంచి మార్గంలోకి ఏ విధంగా పయనించాలో మహర్షి వాల్మీకి జీవితం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని వసతులతో చక్కని విద్యను అభ్యసించేలా  తోడ్పటును అందిస్తున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ వెంకటలక్ష్మి, ఇన్చార్జ్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి, పెద్దాపురం డీఎల్డీవో కెఎన్వీ ప్రసాద్ రాజు, కాకినాడ డీఎల్డీవో పి నారాయణ మూర్తి, బీసీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ జీ.సతీశ్ కుమార్, కాకినాడ, పెద్దాపురం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు పివీవీ. ప్రసాద్, ఎన్.రాజేశ్వరి హెచ్.డబ్ల్యు.ఓలు ఇతర అధికారులు, వివిధ బీసీ వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  

Comments