సీఎం జగన్ అజ్ఞానంతో విద్యా వ్యవస్థ అద్వాన్యం.

 ___ సీఎం జగన్ అజ్ఞానంతో విద్యా వ్యవస్థ అద్వాన్యం


___ టీచర్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం

___ 2024లో జనసేన-టీడీపీదే విజయం 

___ జనసేన పిఎసి అధ్యక్షుడు నాదెండ్ల 

   కాకినాడ, అక్టోబర్ 19 (ప్రజా అమరావతి): 

ప్రభుత్వ ఉపాధ్యాయలకు జీతాలు సక్రమంగా ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం సీఎం జగన్ అర్ధ జ్ఞానంతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటానికి స్విట్జర్లాండ్ సంస్ధతో  ఒప్పదం చేసుకోవటం ప్రజాధనం దుర్వినియోగం చేయటానికేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ తీవ్రస్ధాయిలో ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది అంటూ ఉన్నత స్థాయి అధికారులు చెప్పినా సీఎం జగన్ వినిపించుకోవడంలేదని క్విడ్ ప్రోకో కిందకు వస్తుందన్నారు. గురువారం కాకినాడలోని స్ధానిక హెలికాన్ టైమ్స్లో  మనోహర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఇతర నాయకులతో కలిసి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. 

  ఈ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ 

భారతీయ చట్టాలకు అమోద యోగ్యం కాని స్విట్జర్లాండ్కు చెందిన ఐబి సంస్ధతో రాష్ట్రంలో పాఠశాలలో విద్యావిధానానికీ ఒప్పందం చేసుకోవటం వెనుకు చాలా పెద్ద స్కాం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు నలబై వేల పేచిలుకు పాఠశాలలో ఐబి విధ్యా విదానానికి వేల కోట్ల రూపాయిలు చెల్లించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం క్విడ్ ఫ్రోకో కనిపిస్తుందని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు వేల పాఠశాలలు, భారతదేశం కేవలం రెండు వందల ఎనిమిది పాఠాశాలలకు మాత్రమే ఐబి విద్యా విధానం ఉందని అలాంటి సంస్ధకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలబై వేలకు పైబడి ఉన్న పాఠశాలలో దాదాపు వెయ్యా ఎనిమిది పాఠశాలలు ఐబితో ఒప్పదం చేసుకోవటం, ఒకొక్క పాఠశాలకు మదమూడు లక్షల రూపాయిలు ఐబి సంస్ధకు చెల్లించటానికి ఒప్పదం కుదర్చుకోవటం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయిలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటానికే నని సృష్టమతుందన్నారు. న్యాయ, ఆర్ధిక నిపుణులు సైతం ఈ ఒప్పందం మంచిది కాదని చెప్పినా జగన్ గుడ్డి ధరణిలో ఐబితో ఒప్పందాలు చేసుకోవటం వెనుక పెద్ద కుట్రకోణం కనిపిస్తుందన్నారు.    

   రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సిలబస్ పాఠశాలలను, కేంద్ర సిలబస్ (సిబిఎస్సి)మార్చటానికి కేంద్రం అవకాశం కల్పించినా కేవలం వెయ్యి పాఠశాలలు మాత్రమే సిబిఎస్సి విద్యా విధానంగా మార్చిగల్గిన సీఎం జగన్ ఏ విధంగా వేల కోట్ల రూపాయిలు పరాయిదేశం సంస్ధలకు రాష్ట్ర ప్రజల సొమ్ము దారధత్తం చేస్తారని నాదెండ్ల ప్రశ్నించారు. నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి కేవలం పాఠశాలలకు రంగులు మాత్రమే వేసిన జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము స్వాహా చేయటానికే ఐబి సంస్ధతో ఒప్పంధంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ఠ్రంలో అనేక పాఠశాలలు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నాయని వాటిని మెరుగు పర్చకుండా ఇతర దేశాల సంస్ధలతో ఒప్పందాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు

   తెలుగుదేశం పార్టీతో కలిసి కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు.

తమ నాయకుడు తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపారని, రానున్నరోజుల్లో ఇరు పార్టీలు ఐక్య కార్యచరణతో వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం క్షేత్ర స్ధాయిలో పనిచేస్తామన్నారు. దేశంలో మరే పార్టీ చేయలేని విదంగా తమ జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వం కల్గిన వారికి ఐదు లక్షల బీమా చెల్లిస్తున్నమని రానున్న రోజుల్లో వైసిపి పార్టీ నిరంకుశత్వ పాలనపై పోరాటం మరింత ఉదృతం చేస్తామన్నారు. అనంతరం గాయపడి క్షతగాత్రులైన మరణించిన వారి కుటుంబాలకు నాదెండ్ల ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేశారు. 

  ఈ సమావేశంలో కాకినాడ పార్టీ నగర అధ్యక్షుడు తోట సుధీర్, నాయకులు పాఠంశెట్టి సూర్యచంద్ర, వరుపుల తమ్మయ్య బాబు, అత్తి సత్యనారాయణ, పితాని బాలకృష్ణ, తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, తంగెళ్ల శ్రీనివాస్, పోలసపల్లి సరోజ, సుంకర కృష్ణ వేణి, బట్టు లీల, బండి సుజాత, బోడపాటి మరియ తదితరులు పాల్గొన్నారు

Comments