పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుంది?

 తెనాలి  (ప్రజా అమరావతి);



గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు కూడలిలో మాజీమంత్రి ఆలపాటి రాజా నేతృత్వంలో ఆందోళన - ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రైతులు,టీడీపీ,జనసేన శ్రేణులు- ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన రైతులు - హైలెవల్ ఛానెల్ పరిధిలో పొలాలకు వెంటనే నీళ్లు ఇవ్వాలని డిమాండ్


అర్ధ నగ్నంగా  గొంతు పై కొడవలి పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు 


వరి నారు చేత్తో పట్టుకొని నిరసన చేస్తున్న రైతులు,టీడీపీ,జనసెన, శ్రేణులు 


వరి పంట పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని నిరసన....


ధర్నా చేస్తున్న మాజీ మంత్రులకు వద్దకు వచ్చి సర్దిచెప్పి ప్రయత్నం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు.


మాకు సర్ధిచెప్పటం కాదు రైతులకు నీరు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,నక్కా ఆనంద బాబు..


పొలాల్లో ఒక్క చుక్క నీరు ఉందా? పొలాలకు నీరు ఎందుకు ఇవ్వడంలేదు?

కాల్వలు ఎందుకు శుభ్రం చెయ్యరు 

పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుంది?




వరి పంట ఎండిపోయక మీరు నీరు ఇచ్చి ఏమి ప్రయోజనం?

ఎన్ని ఎకరాల్లో నీరు లేక పంటలు దెబ్బతిన్నాయ్యె మీదగ్గర ఏమన్న లెక్క ఉందా?

దెబ్బతిన్న పంటలకు ఎలా నష్టపరిహారం అందిస్తారో చెప్పగలరా? అని అధికారులను నిలదీసిన మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ , నక్కా ఆనందబాబు .


ఇరిగేషన్ SE,కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ , నక్కా ఆనందబాబు .


కృష్ణ,గుంటూరు,డెల్టా ప్రాంతాలు తక్షణమే పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్

 నందివెలుగు కూడలిలో రాస్తారోకో ఆందోళన విరమించిన రైతులు, టీడీపీ నేతలు - రేపు సాయంత్రంలోగా హైలెవల్ ఛానల్ పరిధిలో నీళ్లు విడుదల చేస్తామని హామీ - కలెక్టర్, ఎస్‍ఈ హామీ మేరకు ఆందోళన విరమించిన టీడీపీ నేతలు, రైతులు - నీరు ఇవ్వకుంటే ఆందోళన కొనసాగిస్తామన్న మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ , నక్కా ఆనందబాబు .


మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్  మీడియా సమావేశంలో  మాట్లాడుతూ -


డెల్టా ప్రాంతంలో రైతులకు 8వేలు క్యూసెక్కులు అవసరం అయితే 3వేలు క్యూసెక్కు లు  మాత్రమే ఇచ్చి రైతాంగాన్ని ఉద్దరిస్తునట్టు ప్రగల్బాలు పలుకుతున్నారు.


రేపు సాయంత్రం కి రైతాంగానికి నీరు ఇవ్వని పక్షంలో ఎల్లుండు రైతుల తరుపున యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు.


వ్యవసాయ మంత్రి బూతులు  తిట్టటమే రైతులను ఉద్ధరిస్తున్నట్టు అనుకుంటున్నారు. 


పంటలకు నీరు అందక ఎండిపోతుంటే వ్యవసాయ మంత్రి ఏమి చేస్తున్నారు?


ముఖ్యమంత్రి ,మంత్రులుఎమ్మెల్యేలు,పైనుంచి క్రింది స్థాయి వరకు దోచుకోవటం, దాచుకోవటం,తప్ప రైతాంగం పడుతున్న కష్టాలు మాత్రం కనపడటంలేదు.


చంద్రబాబు నీ జైల్లో పెట్టి ఏవిధంగా  మానసిక క్షోబాకు గురిచేయ్యాలి టీడీపీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టాలి దాడులు,హత్యలు ఎలా చెయ్యాలి అనితప్ప రైతుల కన్నీరు,కష్టాలు మాత్రం జగన్ ప్రభుత్వం కి కనపడవు.


జగన్ ప్రభుత్వం ప్యాలస్ ల్లో ఉండి పాలన చెయ్యటం మాని ప్యాలస్ బయటకు వస్తే రైతులు పడుతున్న కష్టాలు కనపడతాయి.


జగన్ అధికారంలోకి వచ్చాక డెల్టా ప్రాంత రైతాంగానికి వరం లాంటి పట్టుసీమను నాశనం చేశారు.


గత వారం నుంచి రైతులు నీరు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో రైతులతో కలిసి ధర్నా చేపట్టడం జరిగింది.


ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎండిపోతున్న పంటలను పరిశీలించి నేరుగా రైతులతో మాట్లాడి వారికి కావాల్సిన నీరు అందించాలి.


జగన్ ప్రభుత్వం వ్యవసాయం పట్ల అవగాహన లేమితో రైతాంగానికి తీవ్రఅన్యాయం చేయటమే కాక వ్యవసాయం పట్ల రైతులకు విరక్తి కలిగే విధంగా వ్యవహరిస్తుంది.


జగన్ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలో  రైతే లేకుండా చేయాలని చూస్తున్నట్టుగా ఉంది.


రాష్ట్రంలో వేల ఎకరాల్లో నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది.


రైతులు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని అధికారులకు,ప్రభుత్వం కి చెప్పిన చెవులు ఉండి విననట్టు కళ్ళుండి చూడనట్టుగా పాలకుల వ్యవహార శైలి ఉంది.


ఇప్పటికైన జగన్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి తక్షణమే నీరు ఇవ్వని పక్షంలో రైతులతో కలిసి మరో రెండు రోజుల్లో యుద్ధం ప్రకటిస్తామని మాజీ మంత్రి ఆలపాటి రాజా  హెచ్చరించారు.

Comments