మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ గా ఇనుముల సతీష్ నియామకం.

 *మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ గా ఇనుముల సతీష్ నియామకం*పెద్దపెల్లి జిల్లా:అక్టోబర్ 28 (ప్రజా అమరావతి);

మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ గా ఇనుముల సతీష్ ను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం  ఉత్తర్వులు జారీచేశారు.ఈమేరకు మంథని ఎమ్మెల్యే ఎఐసిసి కార్యదర్శి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు  చేతుల మీదుగా ఈరోజు నియామకం ఉత్తర్వులు అందించారు.


ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..మంథని డివిజన్ లోని మంథని, రామగిరి, ముత్తారం,కమాన్ పూర్ మండలాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం  కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి గాను అవసరమైన మీడియా సహకారాన్ని తీసుకొని కృషి చేయాలని కోరారు.


కాగా తన నియామకానికి కృషి చేసిన మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కాంగ్రెస్ పార్టీ

జిల్లా అధ్యక్షులు, యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు కు ,మీడియా సోదరులకు,మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఇనుముల సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.


కాగా నూతనంగా మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల కన్వీనర్ గా నియమితులయిన ఇనుముల సతీష్ ను మంథని ఎంపిపి కొండ శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ప్రచార కమిటీ కన్వీనర్ ఓ.శ్రీనివాస్ మరియు..


సీనియర్ నాయకులు నూకల బానయ్య, గోటికార్ కిషన్,కుడుదుల వెంకన్న,అయిలి శ్రీనివాస్,ఎల్లంకి వంశీలతో పాటు ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి,అభినందనలు తెలిపారు...

Comments