నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.?*నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.?*


*చంద్రబాబు రాసిన లేఖపై కాదు..అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.*


*నిరాహార దీక్షలపై హత్యాయత్నం కేసులు కాదు...ఎండుతున్న పోలాలకు నీళ్లివ్వండి*


- *తిరుపతిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి*


తిరుపతి (ప్రజా అమరావతి ): నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. వేధించడం, ఇబ్బందులు పెట్టడం గొప్ప అనుకుంటున్నారని మండిపడ్డారు. నిరాహార దీక్షలు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు కాదు...ఎండుతున్న పోలాలకు నీళ్లివ్వండిని సూచించారు. ప్రభుత్వ దృష్టి చంద్రబాబు రాసిన లేఖపై కాదని, అభివృద్ధిపై పెట్టాలన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం భువనేశ్వరి ప్రసంగించారు. ‘‘మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్తామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని..కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం నాలుగు దిక్కులయ్యాం. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయింది. మనవడు దేవాన్ష్ ను చూడక 48 రోజులు అయింది. తిరుపతిని ఎన్టీఆర్ ఎలా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిత్యాన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. తర్వాత చంద్రబాబునాయుడు కూడా తిరుపతిని అభివృద్ధి చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా చంద్రబాబు  అభివృద్ది చేశారు. భక్తి కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ప్రశాంతతో ఉంటారని అభివృద్ది చేశారు. దేవాలయాలకు వచ్చే ఆదాయంతో పుణ్యక్షేత్రాలు మరింత అభివృద్ధి చేయవచ్చు.  2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.  అనంతపురం జిల్లాను ఆటోమెబైల్ హబ్ గా మార్చారు. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలున్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయి. అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉంది..వాళ్లనూ ఇబ్బందలు పెట్టారు. రూ.9,300 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టారు..దీంతో అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించారు. నేను కూడా హెరిటేజ్ నిడిపిస్తున్నా..ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో హెరిటేజ్ ఉంది. మమ్మల్ని వాళ్లు ఆహ్వానించి పరిశ్రమకు ఏం కావాలో అడుతారు..అన్నీ ఇచ్చి పెట్టుబడుల్లో ముందుకు తీసుకెళ్తారు. ఏనాడూ మమ్మల్ని భయపెట్టలేదు. చంద్రబాబు ఉమ్మడి సీఎంగా ఉన్నప్పుడు  హైదరాబాద్ కు ఐఎస్బీ తీసుకొచ్చారు..దాని వెనక చంద్రబాబు ఎంతో కష్టం ఉంది. ఈ ఐఎస్బీలో ఒక్క సీటు కూడా ప్రభుత్వ కోటా కింద ఇవ్వమబోమని చెప్పారు..దానికి చంద్రబాబు మీ సంస్థ హైదరాబాద్ లో ఉంటే చాలు...మాకు ఏమీ వద్దు అని అన్నారు. దీంతో ఇప్పుడు వేలమంది విద్యార్థలు అక్కడ చదివి ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెట్టుబడి దారులను హిసించి, భయపెట్టి బయటకు పంపిస్తున్నారు. అందరినీ భయపెట్టి కేసులు పెడుతున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఎస్వీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా ప్రారంభించారు. ఆయన అరెస్టును నిరసిస్తూ యూనివర్సిటీలో ఆయన అభివమానులు దిష్టిబొమ్మను దహనం చేస్తే హత్యాయత్నం కేసులు పెట్టారు. జనసేన మహిళా నాయకలు మీడియాతో మాట్లాడితే కేసులు పెట్టారు. శ్రీకాళహస్తిలో దీక్షలు చేస్తే కేసులు పెట్టారు. ఇదా రాష్ట్ర గొప్పతనం.? మన రాష్ట్రం ఎలా అవుతుందో...భవిష్యత్ ఏంటో అంతా ఆలోచించాలి. నా పోరాటంలో మహాత్మ గుర్తొస్తున్నారు. ఆయన స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు.. మనం ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాం. ఈ కార్యక్రమానికి నేను రాకముందు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని  చెప్పారు. నిన్న, ఇవాళ చూశాను..లక్షల మందికి ఆయనపై అభిమానం ఉంది..అది ఆయనపై మీకున్ నమ్మకం..ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మహాత్మాగాంధీ రెండు విషయాలు చెప్పారు. అవేంటంటే...ఈ రోజు మనం పోరాటం మన భవిష్యత్ కోసం, మనం చేసే పోరాట బలంతో గెలుపు తథ్యం అని చెప్పారు. అందుకే కలిసి కట్టుగా నడుం బిగించి ఎన్టీఆర్ ఇచ్చిన పౌరుషంతో, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదాం.’’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. 


*సభకు వచ్చిన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.*


*వంగలపూడి అనిత* :  చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా 2019లోనూ ఏపీ ప్రభుత్వం అవార్డు అందుకుంది. 70 వేల మంది ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు.?

*భువనేశ్వరి* : తప్పుడు కేసులు పెట్టి టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రూ.371 కోట్లు అవినీతి అంటున్నారు..అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో చెప్పడం లేదు. 48 రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తే పెట్టుబడిదారులెవరూ రాష్ట్రానికిరారు..పరిశ్రమలు పెట్టరు. సీఐడీ అధికారులు విచారణ చేసుకోండి...ఇలాంటి వాటికి టీడీపీ బెదరదు. పార్టీ సభ్యత్వానికి కార్యకర్తలు రూ.100 ఇస్తే దానిపైనా విచారణ చేస్తామంటున్నారు. ప్రజల సొమ్ముకు చంద్రబాబు ఎప్పుడూ ఆశపడరు. 


*రాజేశ్వరి, గూడూరు* : చంద్రబాబు 45 ఏళ్ల జీవితంలో ప్రజలకు కనబడకుండా ఏ ఒక్క రోజు కూడా లేదు. కానీ ఇప్పుడు చూడక 45 రోజులైంది..చంద్రబాబు ఎలా ఉన్నారు..మాకు ఏమి చెప్పమన్నారు.?

*భువనేశ్వరి* : చంద్రబాబు ప్రజల మనిషి..నాకుంటే మీకే ఎక్కువ ఆయన గురించి తెలుసు. మాకు ములాఖత్ కు 30 నిమిషాలు సమయం ఇస్తున్నారు. 25 నిమిషాలు పార్టీ, ప్రజల గురించే అడుగుతారు. 5 నిమిషాలే మా గురించి మాట్లాడతారు. చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్..ఆయన్ను ఎవరు ఏమి చేసినా బెదరడు. 


*గిరిజ, తిరుపతి* : ఎన్నికల ముందు  చంద్రబాబును అరెస్టు చేసి ఎన్నికలకు ఎళ్లాలని చూస్తున్నారు..దీనిపై మీరు ఏమనుకుంటున్నారు.? 

*భువనేశ్వరి* : మీరు కరెక్టుగా చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబును బయటలేకుండా చేయాలని చూస్తున్నారు. భవిష్యత్ గ్యారంటీ, యువగళం పాదయాత్ర సక్సెస్ అయ్యాయి..దీంతో భయపడి చంద్రబాబును లోపల వేశారు. లోకేష్ మళ్లీ పాదయాత్ర చేస్తారు. ఎన్నికలొస్తున్నాయి..ఓటు చాలా విలువైంది. మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించి ఓటేయాలి. 


*సుధ* : మీ తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు సీఎంగా, మీ కొడుకు మంత్రిగా చేశారు. ఇంత గొప్పస్థాయిని చూసిన మీరు ఈ కష్టాన్ని ఎలా ఎదర్కొంటారు.? 

*భువనేశ్వరి* : మా తండ్రి పౌరుషం నాలో ఉంది. చంద్రబాబుతో పెళ్లయ్యాక క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నా. ఇవే నన్ను ముందుకు తీసుకెళ్తాయి. 


*ప్రవీణ, తిరుపతి* : జగన్ అరెస్టు అయినప్పుడు ఇంట్లో నలుగురు తప్ప ఎవరూ న్యాయం అడగలేదు. కానీ చంద్రబాబు అరెస్టు అయ్యాక, తెలుగు ప్రజలు, ఉద్యోగులు న్యాయం కావాలిని అడుగుతున్నారు..దీనిపై మీరేమంటారు.?

*భువనేశ్వరి* : చంద్రబాబు కష్టం వారు మర్చిపోలేదు..వారి ఇంట్లో వెలుగులు నింపారు. అలాంటి మనషిని మర్చిపోలేదు..ఇప్పుడూ నమ్ముతున్నారు. అందుకే మహిళలు న్యాయం కోసం మందుకు వచ్చి పోరాడుతున్నారు. ఏనాడూ రాని మహిళలు బయటకు వచ్చి పోరాడుతుంటే పోలీసులు ఇబ్బందులు పెడతున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని వారు నమ్మతున్నారు. చంద్రబాబు దసరా శుభాకాంక్షలతో లేఖ రాశారు..దానిపైనా విచారణ చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి మరో పనిలేదా.? ఉత్తరంపై విచారణా.? సమయం వృథా చేస్తున్నారు..అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే..నీరు ఎలా ఇవ్వాలో ఆలోచించకూండా పనిలేని ఆలోచనలు చేస్తున్నారు. 


*సులోచన, తిరుపతి* : మీరు ఈ జిల్లాకు కోడలు అయ్యి 40 ఏళ్లు అయింది..మిమ్మల్ని మేము ఎప్పుడూ ఒంటరిగా చూళ్లేదు. తిరుపతి, నారావారిపల్లికి ఒంటరిగా వెళ్లారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు.? 

*భువనేశ్వరి* : జీవితంలో ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఇవాళ కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది..ఈ ధైర్యంతో అంతా కలిసి ఉన్నాం. 


*భువన, లా స్టూడెంట్ :*  ఎంపీ హత్య చేస్తే ఆధారాలున్నా అరెస్టు చేయలేదు..కానీ చంద్రబాబుపై ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారు..దీనిపై మీరేమంటారు.? 

భువనేశ్వరి : ఆలస్యం అయినా ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు. 


హరిప్రసాద్, జనసేన : ధర్మాన్ని కటకటాల వెనక్కు నెట్టారు..అందుకే పవన్ కళ్యాణ్ ఒక లక్ష్మణుడిలా కదిలి వచ్చారు. పవన్ మిమ్మల్ని కలవడం మీకు ఎలా అనిపించింది.?

భువనేశ్వరి : నన్ను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు బాగున్నారా అమ్మ అని ఆప్యాయంగా అడిగారు. ఈ రాష్ట్రంలో జరిగే అత్యాచారాల గురించి చెప్పి బాధపడ్డారు. మాలాగే రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. మన రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా.

Comments