అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీ.

 
*అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీ


*


*తుది దశకు చేరిన డోన్ పట్టణంలోని అభివృద్ధి పనులు*


*ఐటీఐ హాస్టల్, నెహ్రూనగర్ పార్కు నిర్మాణ పనుల పరిశీలన*


*డోన్ బస్ స్టేషన్ మౌలిక వసతుల పరిశీలన*


*దసరా నవరాత్రుల నేపథ్యంలో అమ్మవారి శాల సందర్శన*


డోన్, నంద్యాల జిల్లా, 16 (ప్రజా అమరావతి); డోన్ పట్టణంలో అభివృద్ధి పనులు, నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం రాత్రి సమయంలోనూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పనులు జరిగిన తీరును పరిశీలించారు. ముందుగా పట్టణంలోని నెహ్రూనగర్ పార్కు పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడ చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోన్న స్విమ్మింగ్ పూల్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీఐ కళాశాల ప్రాంగణంలో భారీ స్థాయిలో నిర్మితమవుతోన్న హాస్టల్ భవన సముదాయ పనులను ఆర్థిక మంత్రి పరిశీలించారు. రూ.5 కోట్లతో నిర్మితమవుతోన్న ఐటీఐ హాస్టల్ బిల్డింగ్ పనులు కొలిక్కి వచ్చినట్లు స్థానిక నాయకులు మంత్రికి వివరించారు. బస్ స్టేషన్ లో క్యాంటీన్ సహా మౌలిక సదుపాయాల పనులను మంత్రి పరిశీలించారు. చివరిగా డోన్ పట్టణంలో అమ్మవారిశాలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెళ్లారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి తదితర నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.Comments