ఇంద్రకీలాద్రిపై చతుర్వేద పండిత సభ*.

  ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 22 (ప్రజా అమరావతి );                                                                                                  *ఇంద్రకీలాద్రిపై చతుర్వేద పండిత సభ*.   


                                                         ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం రాత్రి చతుర్వేద పండిత సభ జరిగింది. శరన్నవరాత్రుల ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ సభలో నాలుగు వేదాల పండితులు వేద శ్లోకాల పఠనం చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏటా సంప్రదాయంగా వస్తున్న ఈ చతుర్వేద పండిత సభలో ఘనాపాటి, క్రమాపాటి వేద పండితుల శ్లోకాలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో 100 మంది ఘనాపాటీలకు రూ. 5,000 చొప్పున, 300 మంది క్రమాపాటీలకు రూ. 4,000 చొప్పున పారితోషకాల్ని అందించారు. అదేవిధంగా అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. సభాధ్యక్షులకు రూ  6,000 పారితోషకం అందజేశారు. కార్యక్రమంలో ఈవో కేఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Comments