శరన్నవరాత్రి ఉత్సవాలు మన ఇంటి పండుగ*.

  ఎన్టీఆర్ జిల్లా. అక్టోబర్ 21 (ప్రజా అమరావతి );           


                                                                                                                 *శరన్నవరాత్రి ఉత్సవాలు మన ఇంటి పండుగ*.                                                           - ఆ భావనతోనే అధికారులు నిబద్దలతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలి.                                                  - దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.                                             ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సామాన్య భక్తజనం దర్శించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది అనే మంచి మాట వినిపించాలనే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రిది అని.. ఆ మేరకే ఏర్పాట్లు చేసినట్లు, విజయవంతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. వచ్చే మూడు రోజులు కూడా ఇదేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేసి.. సామాన్య భక్తజనులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకునేలా చూడాలని సూచించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ తదితరాల అధికారులు నిబద్ధతతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యం అనేది లేకుండా ఇది మన ఇంటి పండుగ అనేలా పని చేయాలని సూచించారు. ఇప్పటివరకు అమ్మవారిని దాదాపు 5.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సరిదిద్దుతున్నట్లు తెలిపారు. కొందరు కిందిస్థాయి పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు గుర్తించామని.. వారిని మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దసరా రోజు సోమవారం దాదాపు రెండు లక్షల మంది అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని.. ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. మంత్రితో పాటు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. 

Comments