సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన ఎస్ఐపిసి సమావేశం.

 సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన ఎస్ఐపిసి సమావేశం


అమరావతి,20 అక్టోబరు (ప్రజా అమరావతి):రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ(SIPC) సమావేశం శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు,సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు రాయితీలు,భూమి కేటాయింపు తదితర అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చించి వాటికి కమిటీ ఆమోదం తెలపడం జరిగింది.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స సమ్మిట్ లో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నకంపెనీలు,సంస్థలు సహా ఆతర్వాత పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు,సంస్థలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన రాయితీలు,భూమి కేటాయింపు అంశాల్లో సత్వర చర్యలు తీసుకుని వాటిని సకాలంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలను వివరిస్తూ అందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.సమావేశంలో అజెండా వారీగా ఆయా సంస్థలు,కంపెనీలు ఏర్పాటుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

ఈసమావేశంలో ఇంధన,ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్, ఎస్.ఎస్.రావత్,వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి,రాష్ట్ర పర్యాటక శాఖ సంస్థ ఎండి కె.కన్నబాబు,నెడ్ క్యాప్ ఎండి రమణారెడ్డి,పుడ్ ప్రోసెసింగ్ సొసైటీ సిఇఓ ఎల్.శ్రీధర్ రెడ్డి,ఎపిఐఐసి ఎండి ప్రవీణ్ కుమార్,పరిశ్రమల శాఖ కమీషనర్ సిహెచ్. రాజేశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments