మండల కేంద్రంలో పుసుపు – సమగ్ర యాజమాన్యంపై రైతు అవగాహన సదస్సు

  కొల్లిపర (ప్రజా అమరావతి);

 గుంటూరు జిల్లా వనరుల కేంద్రం అధికారులు మరియు ఏరువాక శాస్త్రవేత్త కలసి కొల్లిపర మండలం తూములూరు గ్రామములో పుసుపు – సమగ్ర యాజమాన్యంపై రైతు అవగాహన సదస్సునిర్వహించి, పసుపులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు కావలసిన సూచనలు  అందించారు. మరియు , గ్రామంలో సాగు చేయబడుతున్న ఇతర పంటలకు సంబంధించి రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. 

అనంతరం, తూములూరు మరియు దావులూరు గ్రామాలలోని వరి, మినుము, పసుపు, అరటి, కంద పంటలలో క్షేత్ర సందర్శన జరిపారు. ఈ సందర్భంగా క్రింది సూచనలను రైతులకు తెలియజేస్తున్నారు: 

వరిలో ఆకుచుట్టు పురుగు ఉనికిని గమనించడమైనది.పురుగు ఉనికిని ఉద్రుతిని గమనించి, ఆకుముడత పురుగు నివారణకు , ఎకరాకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ @ 400గ్రా. (లేదా), క్లోరాన్ట్రానిలిప్రోల్ 60 మీ.లీ పిచికారీ చేసుకోవాలి

వరిలో సుడిదోమ ఉనికిని గమనించి, నివారణకు , పొలంలో నీటిని తీసివేసి, ఎకరాకు  థయోమిథాక్సామ్ @ 40గ్రా., (లేదా) డైనోటేఫ్యురాన్ 60 – 80 గ్రా., (లేదా) పైమెట్రోజైన్ 120 గ్రా. చొప్పున మొక్క మొదళ్ళపై బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. 

మినుములో వైరస్ తెగుళ్ళను వ్యాపింపజేసే రసంపీల్చు పురుగుల నివారణ కొరకు  ఎకరాకు  థయోమిథాక్సామ్ @ 40గ్రా.,(లేదా), ప్రోఫెనోఫాస్ 400 మీ.లీ, (లేదా), ఫిప్రోనిల్ 350 మీ.లీ లను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి

పసుపులో తాటాకు తెగులు మరియు ఆకు మచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు, లీటరు నీటికి అజాక్సీస్ట్రోబిన్+ డైఫేనకొనజోల్ (అమిస్టార్ టాప్), లేక (గోడివ సూపర్) లేక, (సాలిట్యుడ్) @ 1 మీ.లీ. చొప్పున కలిపి,  పిచికారీ చేసుకోవాలి 

శ్రీ. పి. రామాంజనేయులు , జిల్లా శిక్షణా అధికారి, జిల్లా వనరుల కేంద్రం, గుంటూరు, శ్రీమతి. శ్రీలత వాణి , ప్రధాన శాస్త్రవేత్త (Extn), ఏరువాక కేంద్రం, లాం, గుంటూరు, రాజవంశి, వ్యవసాయ అధికారి, జిల్లా వనరుల కేంద్రం, గుంటూరు, శ్రీమతి.అనుష, MPEO, తూములూరు, HEO శ్రీధర్ రెడ్డి, రైతులు, కొండా కిశోర్ రెడ్డి, నలుకుర్తి ముక్కంటి, వింతా.వేమారేడి, గొమ్ము నాగిరెడ్డి , గొట్టిముక్కల శ్రీధర్ తదితర రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Comments