గ్రామ స్వరాజ్య దిశగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి.

 


*గ్రామ స్వరాజ్య దిశగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశా నిర్దేశం చేసిన కేంద్ర


పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరి రాజ్ సింగ్*


తిరుపతి, అక్టోబర్ 21 (ప్రజా అమరావతి): కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్ని రాష్ట్రాలు వాటిని  ప్రజలకు చేర్చుటలో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తున్నాయని, తిరుపతి పర్యటన సందర్భంగా తన శాఖకు చెందిన పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న పలు అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులతో కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమీక్ష నిర్వహించి  అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి గారు ఎంపీ గురుమూర్తి మెంబర్ రాయుడు పాల్గొనగా రాష్ట్ర అధికారులతో సంబంధిత శాఖ అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో సర్వే మరియు లాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, కమిషనర్ పంచాయతీరాజ్ సూర్య కుమారి స్పెషల్ కమిషనర్ పంచాయతీ సిరి డైరెక్టర్ నరేగా చిన్న తాతయ్య డైరెక్టర్, జెసి డికే బాలాజీ, వాటర్ షెడ్స్ వెంకటరెడ్డి ఈఎన్సి పంచాయతీరాజ్ బాలు నాయక్ తదితర రాష్ట్ర అధికారులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


 స్వామిత్వా కింద రాష్ట్రంలో గ్రామకంటాలు, వ్యవసాయ భూములు రీ సర్వే సమాంతరంగా చేపడుతున్నామని, 17000  గ్రామాల్లో రీసర్వే చేపట్టడం జరిగిందనీ, సుమారు 13 వేల గ్రామాల్లో ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి డ్రోన్ ఫ్లై, ఇమేజింగ్ వంటివి పూర్తి అవుతాయని, 4 వేల దాకా గ్రామాల్లో పూర్తి స్థాయిలో రీ సర్వే జరిగి హక్కు పత్రాలు అందచేసామని వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లింక్ చేయడం జరిగిందనీ సర్వే మరియు లాండ్ రికార్డ్స్ కమిషనర్ గారు మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్వామిత్వా ముఖ్య ఉద్దేశ్యం తగాదాలు లేని ఖచ్చితత్వం గల యూనిక్ ఐ.డి నంబర్ తో ఎల్ పీ నంబర్ తో భూ ఆధార్ ద్వారా సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాలకు, బ్యాంకు, కోర్టు కు అనుసంధానం చేయనున్నామని, ప్రతి కమతానికి విశిష్ట సంఖ్య ఏర్పాటుతో ప్రపంచంలో ఎక్కడ నుండి అయిన తమ భూమి వివరాలను ప్రజలు పరిశీలించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ షెడ్ పథకం కింద 370 ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందనీ, ఫేజ్ 1 కింద 13.62 లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించుకునీ, పనులు పురోగతిలో ఉన్నాయని, వాటర్ టేబుల్ 1.5 మీ. ల నుండి 4.40 మీ. గణనీయంగా పెరిగిందనీ అధికారులు వివరించారు. వర్షపాతం తక్కువ గల ప్రాంతాలకు ఈ కార్యక్రమం ఒక వరమని మంత్రి అన్నారు. వర్షాభావ ప్రాంతాల్లో క్యాక్టస్, వంటి వాటిని పెంచేలా చర్యలు తీసుకోవాలని తద్వారా మీథేన్ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు.  సోదాహరణంగా భోపాల్ లో బయోగ్యాస్ ఉత్పత్తి, కంప్రెస్డ్ సి ఎన్ జి తయారీ జరిగిందనీ మంత్రి వివరించారు. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వాటికి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేటి కాలంలో కార్బన్ ఉద్గారాల నుండి ప్రకృతి లో విపత్కర మార్పులు జరుగుతున్నాయని, వాటిని తగ్గించాలంటే క్యాక్టస్ (బ్రహ్మ జముడు) లాంటి వాటిని పెంచడం వలన బయో గ్యాస్ ఉత్పత్తి, వాడకం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. గృహ నిర్మాణ శాఖ కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు వచ్చే సంవత్సరం మార్చి 2024 నాటికి పూర్తి కావాలని సూచించారు. పంచాయితీ రాజ్ కింద ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 1140 km లక్ష్యానికి గాను వచ్చే సంవత్సరం మార్చి 2024 నాటికి పూర్తి చేస్తామని ఈఎన్సి తెలిపగా నాణ్యతగా పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఆధార్ సీడింగ్ 99 శాతం పైగా పూర్తి అయిందని అధికారులు తెలిపారు. అమృత్ సరోవర్ రాష్ట్ర లక్ష్యం 1950 కి గాను లక్ష్యానికి మించి 2960 పూర్తి చేశామని తెలిపారు. నరెగా సపోర్ట్ కింద మార్కెట్ డిమాండ్ ఉన్న పండ్ల మొక్కలను కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్  తదితర వాటిని ఒక్కోక్క  క్లస్టర్ ఆఫ్ విలేజెస్ గా పెంచాలని, పొదుపు సంఘాలను భాగస్వామ్యులు చేసి మంచి ఆదాయం వచ్చేలా చేయాలని సూచించగా అధికారులు అలాగే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతో, బయో ఫర్టిలైజర్ కూడా తయారు అవుతుందని,  ప్రతి పేద కుటుంబానికి ఆవులు గేదెలు ప్రభుత్వ పథకం కింద ఇవ్వగలిగితే వాటికి ఐవిఎఫ్ ద్వారా వాటి సంతానోత్పత్తి, ఆ పశు సంపద నుండి పాలు, ఫెర్టిలైజర్, బయో గ్యాస్ ఏర్పాటు తదితర సపోర్ట్ తో వారికి సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఆదాయం  అందించవచ్చు అని అన్నారు. అధికారులు వివరిస్తూ పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ పథకాలను అనుసంధానం చేసినమలు చేస్తున్నామని తెలిపారు. నరెగా కింద నాణ్యమైన మొక్కలు నాటడం, పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి వాతావరణంలో విపరీత మార్పుల ద్వారా వర్షాలు సకాలంలో పడని పరిస్థితుల నుండి బయట పడవచ్చు అని మంత్రి అన్నారు. నరెగా కింద లేబర్ కి పని దినాలు మెరుగ్గా ఇవ్వగలిగామని, అమృత్ సరోవర్ కింద చెరువుల కరకట్టలను పటిష్ట పరిచామని అధికారులు వివరించారు. నరెగ నిధులు వాటికి ఉద్దేశించబడిన లక్ష్యం కొరకు వాడాలని మంత్రి సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సామాజిక భద్రత కింద వివిధ రకాల పెన్షన్లు డిబిటి ద్వారానే అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించగా అధికారులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు డిబిటి పద్దతి ద్వారా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు.  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 లక్షల ఎస్ హెచ్ జి లు అందరూ ఆయూష్మాన్ భారత్ కింద కవర్ అయ్యారని తెలిసి మంత్రి సంతోషించారు. ప్రధాన మంత్రి మోడీ గారి ప్రభుత్వం కన్నా ముందు బ్యాంక్ లింకేజి తక్కువగా, ఎన్పిఏ ఎక్కువగా  ఉండేదని నేడు బ్యాంక్ లింకెజి లక్షల కోట్ల రూపాయలు  ఇప్పటికే అందించామని, ఎన్పిఏ 1.7 శాతానికి తగ్గిపోయింది అని తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు 10 వేలకు తక్కువ కాకుండా ఉండేలా నరెగ, ఎన్ ఆర్ ఎల్ ఎం కలిపి పేద కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పొదుపు సంఘాలకు సక్రమంగా తిరిగి కట్టిన వారికి సిబిల్ స్కోర్ తెలిసేలా వారికి తిరిగి ఇచ్చే రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అందించాలని సూచించగా మన రాష్ట్రంలో అదే విధంగా అమలు చేస్తున్నామని అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర  మంత్రిని ఎంపీ, రాష్ట్ర అధికారులు సన్మానించారు.


ఈ సమీక్షలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబందించిన శాఖల జిల్లా అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.



Comments