*టీడీపీ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు... చంద్రబాబు త్వరలో బయటకొస్తారు : నారా భువనేశ్వరి
*
*చంద్రబాబు అక్రమ అరెస్టుతో గుండెఆగి మృతి చెందిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ.*
*బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం*
శ్రీకాళహస్తి/రేణిగుంట (ప్రజా అమరావతి):- టీడీపీ కార్యకర్తలెవ్వరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సూచించారు. న్యాయం గెలిచి త్వరలోనే చంద్రబాబు విడుదల అవుతారని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో గుండె ఆగి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మూడో రోజు భువనేశ్వరి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నమ్మ, యంగిటీల వసంతమ్మ, పొలి గ్రామంలో పొలి మునిరాజా కుటుంబ సభ్యులను భువనేశ్వరి కలిసి పరామర్శించారు. చనిపోయిన వారికి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మీకు ధైర్యం చెప్పమని చంద్రబాబు చెప్పారు అని భువనేశ్వరి అన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
addComments
Post a Comment