స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని పౌవురులు భాగస్వామ్యం ఎంతో ముఖ్యo.భీమవరం: అక్టోబర్ 1 (ప్రజా అమరావతి);


 *స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని పౌవురులు భాగస్వామ్యం ఎంతో ముఖ్య


మని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఉద్ఘాటించారు.* 


ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో  చేపట్టిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమాలను విద్యార్థులతో కలిసి స్వయంగా నిర్వహించారు. తొలుత 11వ వార్డు బిఎన్ రోడ్డు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కొద్ది సమయం స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదుపరి 33వ వార్డు అభిరుచి హోటల్ ముందు గల గొల్లవాని తిప్ప కెనాల్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి స్వచ్ఛత శ్రమదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.  గ్రామాలు, పట్టణాలు అన్ని ప్రాంతాలలో స్వచ్ఛత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. స్వచ్ఛత లేకపోతే అనారోగ్యానికి గురయ్యి సమాజం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.  జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడే స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి స్వయంగా వారే నెత్తిన తట్ట పెట్టుకుని చీపురుతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంటూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలని అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందన్నారు.  గతంలో బహిరంగ మరుగుదొడ్లు ఉండేవని వాటి కారణంగా ఎన్నో వ్యాధులు ప్రభలేవని, నేడు అటువంటి పరిస్థితి లేకుండా పేదవారికి సైతం మరుగుదొడ్ల ఏర్పాటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  అపరిశుభ్రత వలన ఏదైనా వ్యాధి బారిన పడితే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, మానసికంగా చితికి పోతుందని ఈ సందర్భంగా తెలిపారు.  పరిసరాల పరిశుభ్రత ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా స్వచ్ఛందంగా ఎవరికి వారు నా ఇల్లు, నా ప్రాంతం అనేదిగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం  కమిషనరు యం.శ్యామల, తహశీల్దారు వై  రవి కుమార్, యంపిడివో కె వెంకట లక్ష్మి, మున్సిపల్ ఇంజనీరు పి త్రినాథ రావు, వార్డు నాయకులు, వార్డు సచివాలయం సిబ్బంది, పురపాలక సంఘం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Comments