*రూ.19.5 కోట్లతో విస్తరించిన డోన్ -కృష్ణగిరి రహదారిని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*రూ.19.5 కోట్లతో విస్తరించిన డోన్ -కృష్ణగిరి రహదారిని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*గుమ్మకొండలో రూ.1.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవం*


*రూ.1.27 కోట్లతో డోన్ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభం*


*మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్పీపీలోకి చేరిన 150 కుటుంబాలు*


*10 కి.మీ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం*


*రూ.3 కోట్లతో వెంకటాపురం చెరువు వద్ద పర్యాటకాభివృద్ధి పనుల పరిశీలన*


*హెచ్.ఎన్.ఎస్.ఎస్ పథకం ద్వారా వెంకటాపురం చెరువుకు నీరు చేరడాన్ని పరిశీలన*


*డోన్ లో అభివృద్ధికి కృతజ్ఞతగా గజమాలతో మంత్రి బుగ్గనకి ఘన సత్కారం*


*రెండు సార్లు గెలిపించిన ప్రజల వల్లే డోన్ అభివృద్ధి*


*స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


డోన్, నంద్యాల జిల్లా, నవంబర్, 27 (ప్రజా అమరావతి); ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వరుస ప్రారంభోత్సవాలతో డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతున్నారు. సోమవారం రూ.19.5 కోట్లతో డోన్ నుంచి కృష్ణగిరి వరకూ విస్తరించిన రహదారిని అట్టహాసంగా మంత్రి బుగ్గన ప్రారంభించారు. తనను నమ్మి రెండు సార్లు గెలిపించిన ప్రజల వల్లే డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా నిలపడం సాధ్యమైందన్నారు. 10 కి.మీ దూరం  పాదయాత్ర చేస్తూ ప్రజలతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  మమేకమయ్యారు. అడుగడుగునా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్రకు స్థానిక ప్రజలు సంఘీభావం తెలిపారు.  ముఖ్యమంత్రి సమక్షంలో గతంలో డోన్ లో చెప్పినట్లుగానే డోన్ ను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దినందుకు  కృతజ్ఞతగా గజమాలతో మంత్రి బుగ్గనకి వెంకటాపురం గ్రామంలో ఘన సత్కారం చేశారు. 77 చెరువులకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీరు నింపే కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామంలోని చెరువుకు వచ్చి చేరుతున్న నీటిని మంత్రి బుగ్గన పరిశీలించారు. చెరువుల అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.


*ప్రతిపక్షాల గ్యారంటీలకు వారంటీ లేదు*


టీడీపీ నిర్వహించే 'బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ' కార్యక్రమం అబద్ధాలమయమన్నారు. టీడీపీ గతంలో చేసిన పసుపు-కుంకుమ, వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాల లాగే మరో బూటకమన్నారు. చెప్పిన మాట నెరవేర్చని వారి గ్యారంటీని ప్రజలు నమ్మరన్నారు. చెప్పినవి చెప్పినట్లు చేసిన జగన్ ప్రభుత్వాన్నే ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సామాజిక పెన్షన్ల పెంపు,వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేదోడు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సచివాలయాల నిర్మాణం ద్వారా చేరువైన ప్రభుత్వ సేవలే జగన్ మార్కు పాలనకు నిదర్శనమన్నారు. డోన్ లో టీడీపీ ఇన్ ఛార్జ్  అని చెప్పుకునేవారిని సొంత పార్టీ వాళ్లే వార్డు మెంబర్ అయి చూపించమని సవాల్ విసురుతుండడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల మన్నన పొందడం మీద కన్నా వారిని మోసం చేసి గెలిచేందుకే డోన్ లో రాజకీయ నాయకులు ప్రాధాన్యతనిచ్చారన్నారు. కరవు మండలాల ప్రకటన ప్రక్రియపై ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. ప్రజలు తాను చేసిన అభివృద్ధిని గుర్తించి గౌరవిస్తుంటే..ప్రతిపక్షాలు మాత్రం అర్థం లేని ఆరోపణలతో ఇంటింటికి తిరుగుతూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. నిత్యావసర ధరల పెంపు నిందను కూడా ప్రభుత్వంపై వేయడం విపక్షాల అవగాహనరాహిత్యానికి నిదర్శనమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.


*రూ. 1.5 కోట్లతో గుమ్మకొండలో నిర్మించిన ఆర్బీకే, సచివాలయం, హెల్త్ సెంటర్ల ప్రారంభం*


డోన్ మండలం గుమ్మకొండలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రారంభించారు. రూ.కోటి విలువైన ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రారంభోత్సవం అనంతరం ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ఒక్క గుమ్మకొండలో మాత్రమే అమ్మఒడి కింద 264 మంది తల్లుల ఖాతాలకు రూ.24 లక్షలు జమ చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. విద్యాదీవెన కింద 130 మంది చిన్నారులకు 31.60 లక్షలు అందజేశామన్నారు.వైఎస్ఆర్ రైతు భరోసా కింద 450 మంది రైతులకు రూ.2.32 కోట్లు పంపిణీ చేశామన్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా  పథకం ద్వారా 500 మంది రైతులకు రూ.77 లక్షలు, 290 మంది వృద్ధులకు రూ.2.95 కోట్లు సామాజిక పెన్షన్లు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 140 మంది మహిళలకు రూ.62 లక్షలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు మహిళలకు 65 మందికి రూ.8 లక్షలు నేరుగా ఖాతాలకు జమ చేసిన వివరాలను ఆర్థిక మంత్రి ప్రజలకు తెలిపారు. ఎన్నికలకు ముందు చెప్పిన అన్ని హామీలను వైఎస్ జగన్ ఐదేళ్ల పరిపాలనలో నెరవేరుస్తుంటే..చేయనివి మాత్రమే చెప్పడం టీడీపీ నైజమని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారన్నారు. 


*స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి*


డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. వివేకనందుడి ఆలోచనల ప్రభావం సమాజాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి బాటగా నిలుస్తుందన్నారు.


*డోన్ మున్సిపాలిటీ పరిధిలో రూ.1.27 కోట్లతో దీపాల వెలుగులు : ఆర్థిక మంత్రి*


డోన్ మున్సిపాలిటీలో దీపాల వెలుగులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. రూ.1.27 కోట్లతో గుత్తి రోడ్డు జంక్షన్ నుంచి అమ్మ హోటల్, వివేకానందుడి విగ్రహం మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ దీపాల వెలుగుతో డోన్ పట్టణం మరింత ఆకర్షణగా నిలుస్తుందన్నారు.


*ఆర్థిక మంత్రి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన 150 కుటుంబాలు*


ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో సకల మౌలిక సదుపాయాలతో డోన్ నియోజకవర్గ అభివృద్ధి సాధించిన నేపథ్యంలో పట్టణంలో తారకరామా నగర్ కు చెందిన టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. డీలర్ ఎద్దుపెంట వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడు కుమ్మరి రాజు  సమక్షంలో  టీడీపీకి చెందిన 150 కుటుంబాలకు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్  పార్టీ కండువాలు వేసి వైసీపీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి బలిజ రాజు, జనార్ధన్, కూరగాయల వెంకట్రాముడు, ఎరుకల శివ, వడె వెంకటేష్, బోయ శివ, సుకన్య, శకుంతల, ఎరుకల మద్దమ్మ , బలిజ తిమ్మ మ్మ, రాథ, బోయ వీరేష్, వినోద్, మంగలి పరమేష్, హరి, మనోజ్, మేకల శ్రీను, రసూల్, బోయ వెంకటసామి, బోయ నాగరాజు, చాకలి పవన్, వేణు, తరుణ్, బోయ కుమార్, సూరి, రాఘవేంద్ర, బాలకృష్ణ, సురేష్, రవి, వి. రాజు, లతో పాటు మరి కొంత మంది వైసీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వెంకటస్వామి, లక్ష్మిరెడ్డి, ఎరుకల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ సభ్యులు రాజ్ కుమార్, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్  తిరుమల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ రామచంద్రుడు, తదితరులు హాజరయ్యారు.


Comments