వరల్డ్ ఫుడ్ ఇండియా లో పాల్గొన్న మంత్రి కాకాణి.

 వరల్డ్ ఫుడ్ ఇండియా లో పాల్గొన్న మంత్రి కాకాణి.




న్యూ ఢిల్లీ (ప్రజా అమరావతి)




న్యూఢిల్లీ లోని భారత్ మండపం లో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 లో పాల్గొని, పారిశ్రామికవేత్తలతో సమావేశమైన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి .


ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని విధాల అనువైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన మంత్రి కాకాణి".


"ఆంధ్ర రాష్ట్రం,పరిశ్రమల స్థాపనకు అన్ని సౌకర్యాలతో, మౌలిక వసతులతో పెట్టుబడులను ఆకర్షించేందుకు సరైన రాష్ట్రమని పేర్కొన్న మంత్రి కాకాణి"


ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు, నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలియజేసిన మంత్రి కాకాణి"


ఆంధ్ర రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలంతా ముందుకు రావాలని విజ్ఞప్తి చేసిన మంత్రి కాకాణి"


"మంత్రి కాకాణి సమక్షంలో పరిశ్రమల స్థాపనకై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న పలువురు పారిశ్రామికవేత్తలు"


ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి"

Comments