నేటి బాలలే రేపటి పౌరులు : సెర్ఫ్ సిఇఓ మహ్మద్ ఇంతియాజ్.


విజయవాడ (ప్రజా అమరావతి);

నేటి బాలలే రేపటి పౌరులు : సెర్ఫ్ సిఇఓ మహ్మద్ ఇంతియాజ్


పిల్లలచే చాచా నెహ్రూగా అభిమానించబడే నెహ్రూ పుట్టినరోజున దేశమంతటా బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని  ఆంధ్రప్రదేశ్ సమగ్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముఖ్య కార్య నిర్వహణధికారి ఎ.ఎమ్.డి.ఇంతియాజ్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ఎన్ టి ఆర్ పరిపాలనా భవనం లోని సెర్ఫ్ కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్బంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని "చాచా నెహ్రూ చెకుముకి అవార్డు" ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.  ముందుగా సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్ నెహ్రు చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీకి అభిమాన నాయకులైన జవహర్ లాల్  నెహ్రూ స్వతంత్ర భారతావనికి తొలి  ప్రధానిగా  భాద్యతలు చేపట్టారని వివరించారు.  అనంతరం విద్యార్థులకు అవార్డు ప్రదానం చేశారు. 

ఈకార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం, ఎస్.ఆర్.ఆర్.చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఎస్.రామచంద్ర రావు, డి.ఎస్పీ.ఎన్.బి.ఎమ్.మురళీకృష్ణ, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపకులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్, అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments