*ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం
*
• నేతృత్వం వహించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు .
విజయవాడ (ప్రజా అమరావతి);
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మనబడి: నాడు -నేడు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు విజయవాడలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ మున్సిపల్ హైస్కూల్ అరండడల్ పేట, కృష్ణలంక లోని వంగవీటి మోహనరంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది.
సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ సందర్శనలో... పి.కార్తీక్ (ప్రపంచ బ్యాంకు స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్, టీం టాస్క్ లీడర్), డా. హర్ష అత్రుపానె (లీడ్ ఎకానమిస్ట్, వరల్డ్ బ్యాంక్), క్రిస్టల్లె అలెగ్జాండ్రా అహున్విన్ కౌమే (ఎకానమిస్ట్) ట్రాసీ విలిచౌస్కీ(ఎనలిస్ట్), కన్సల్టెంట్లు సురభి భాటియా, సిద్దార్థ్ సచ్ దేవ్, ప్రియాంక సాహూ, కునాల్ దత్ పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో తొలుత ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ మున్సిపల్ స్కూల్ సందర్శించి మన బడి: నాడు – నేడు పనుల్లో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల భాగస్వామ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా నాడు నేడు పనులు పనులు ఎవరు చేస్తున్నారు? నాడు నేడు పనులకు అవసరమైన మెటీరియల్ ఎలా కొనుగోలు చేశారు? నిధుల చెల్లింపులు, నాడు నేడు అభివృద్ధి కారణంగా విద్యార్థుల నమోదు ఎలా ఉంది? నిధులు జాప్యం జరిగినప్పుడు ఆ సమస్య ను ఎలా అధిగమించారు? తదితర ప్రశ్నలకు రెండు పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు ఇచ్చిన సమాధానాలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతినిధులకు ఎన్.సి.సి విద్యార్థులు గౌరవ వందనం చేశారు.
అనంతరం ఈ బృందం సెక్రటరియేట్ లో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ ని కలిశారు. కార్యక్రమంలో మన బడి: నాడు – నేడు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.కాలేబ్, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారిణి సివి రేణుక, APEWIDC చీఫ్ ఇంజనీర్ గోపీచంద్ , VMC SE శ్రీ రాంమోహన్ రావు , ఉపవిద్యాశాఖాధికారి కె.విఎన్.కుమార్ , మండల విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్ష సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు VMC స్కూల్స్ సూపర్ వైజర్స్ పాల్గొన్నారు.
addComments
Post a Comment