అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ

    కొల్లిపర (ప్రజా అమరావతి );         స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్, అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలిస్ గుంటూరు, D.N. మహేష్ వారి ఆదేశాల మేరకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్  A.V.  చలం  వారి సిబ్బంది సహాయం తో ఇసుక అక్రమ రవాణా కి  సంబందించిన నేరము ల పై దాడులు నిర్వహించి
, కొల్లిపర మండలం అత్తోట గ్రామం లో ముగ్గురు వ్యక్తులు  చొప్పర అశోకు, కొండూరు సురేష్, కొమ్మారెడ్డి బాల కిషోర్ రెడ్డి అను వారు నుండి మూడు ట్రాక్టర్ లలో  ఇసుక మున్నంగి గ్రామం నుండి అక్రమంగా తరలిస్తుండగా వారిని అదుపులోనికి తీసుకొని, కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కొల్లిపర పోలిస్ స్టేషన్ లో అప్పగించటమైనది.


Comments