తాడేపల్లి/ఇప్పటం (ప్రజా అమరావతి);
నారా లోకేష్,శంకర్ శెట్టి పిచ్చయ్య సంయుక్త సహకారంతో 25 తైవాన్ బ్యాటరీ పంపులు,2 తోపుడు బండ్లు,1 రిక్షా బండి అందచేత.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటం టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్ శెట్టి పిచ్చయ్య సంయుక్త సహకారంతో బుధవారం ఇప్పటంలో రైతులకు 25 తైవాన్ బ్యాటరీ పంపులు, చిరు వ్యాపారులకు 2 తోపుడు బండ్లు,
రిక్షా కార్మికునికి 1 రిక్షా బండి,
అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ
వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని
అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావాలన్నారు. అధికారంలో లేకపోయినప్పటికీ నారా లోకేష్ మంగళగిరిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు,మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ జనసేన ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్,మంగళగిరి నియోజకవర్గ టిడిపి పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు,తాడేపల్లి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణ వందన, తాడేపల్లి మండల జనసేన ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీధర్,తాడేపల్లి మండల జనసేన యువజన విభాగం అధ్యక్షులు తిరుమల శెట్టినరసింహారావు,
ఇప్పటం గ్రామ ,ఇప్పటం గ్రామ జనసేన అధ్యక్షులు సాధు కొండలరావు, టీడీపి నాయకులు కాట్రగడ్డమధుసూదనరావు,
జెముడుగాని రత్తయ్య,నర్సయ్య గౌడ్,పఠాన్ జానీ ఖాన్,గాజుల నగేష్,జెముడుగాని మహేంద్రబాబు,మల్లికార్జున రావు,కాటూరి నాగేశ్వరరావు,ఇప్పటం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment