ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి .

 ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి 


రాష్ట్ర విద్యుత్ శాఖ మరియు అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మరియు శ్రీ సత్య సాయి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం


ఈనెల ఆరో తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది

జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు



పుట్టపర్తి, నవంబర్ 4 (ప్రజా అమరావతి):


వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ సొమ్ము విడుదలకు ఈనెల 7న సీఎం జగన్ మోహన రెడ్డి  పుట్టపర్తికి విచ్చేస్తున్నారని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలనిరాష్ట్ర విద్యుత్ శాఖ మరియు అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలోసీఎం పర్యటన కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు భద్రత చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మరియు శ్రీ సత్య సాయి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం,జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఎంపీ గోరంట్ల మాధవ, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మా, ఎస్పీ మాధవరెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా మీకు కేటాయించిన విధులు సక్రంగా నిర్వర్తించాలని తెలిపారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు 

వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం నిధులు సొమ్మును ఇక్కడి నుంచి విడుదల చేస్తారన్నారు. 7 వ తేదీ ఉదయం  9.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్టు రాక, అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ లోపు ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను పుట్టపర్తి శివారు ప్రాంతంలోని వై.జంక్షన్ లో ఉన్న బహిరంగ సభ వేదిక  (ప్రైవేట్ క్రికెట్ మైదానము) వాహనాల పార్కింగ్, ఎయిర్ పోర్ట్, పలు ప్రదేశాలను పరిశీలించారు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు కార్యక్రమంలో  వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ,పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి,  డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష,  పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్,  ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి,   సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్ , డిపిఓ విజయ్ కుమార్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, ఎల్ డి ఎం,  బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, సిపిఓ విజయ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్  అధికారి ఖయ్యం, చేనేత జోళ్  శాఖ అధికారి రమేష్ బాబు,  ఇతర శాఖల  అధికారులు తదితరులు పాల్గొన్నారు



Comments