ఏ ఎస్ ఎన్ డిగ్రీ కాలేజీకి అవార్డులు రావటం చాలా సంతోషంగా ఉంది చైర్మన్ శివకుమార్

  తెనాలి (ప్రజా అమరావతి );


   ఈనెల 17 నుండి 20 వ తారీఖు వరకు గోవా రాష్ట్రములో AICTE మరియు Edu Skills అనే ప్రముఖ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సెమినార్ లో తెనాలి పట్టణ ప్రకాశం రోడ్డులోని ASN డిగ్రీ కాలేజీ కి విద్యారంగంలో, ఉద్యోగఅవకాశాలు కల్పించటంలో విశేష ప్రతిభ కనబరిచి నందుకుగాను దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల విభాగంలో 34 వ ర్యాంకును, మరియు సౌత్ ఇండియా లో ప్రథమ ర్యాంకును మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్ మరియు అవార్డులను అందజేసింది. అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందని మీడియాతో ముచ్చటించిన ASN విద్యాసంస్థల ఛైర్మన్ & తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్ .

Comments