శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి);: 

    కార్తీక పౌర్ణమి సందర్బంగా ఈరోజు ప్రదోష కాలంలో దీప ప్రజ్వలనతో కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రారంభించిన  రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ ..

    అనంతరం వీరు చిన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన జ్వాళాతోరణం వద్ద ఆలయ  వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, జ్వాలా తోరణం వెలిగించారు.


ఈ సందర్బంగా 


మంత్రివర్యులు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. 


 కోటి దీపోత్సవం కార్యక్రమం నందు భక్తులు విశేషముగా పాల్గొని, దీపములు వెలిగించి శ్రీ అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి వారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహణాధికారులు, వైదిక కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Comments