సెకండ్ ఏ ఎన్ ఎమ్ లను రెగ్యులర్ చేయాలి.

 *సెకండ్ ఏ ఎన్ ఎమ్ లను రెగ్యులర్ చేయాలి


*


*వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నివాస్ కు వినతి*


మంగళగిరి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కోరుతూ, నగరంలోని ఏపీఐఏసి భవనంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నివాస్ ను కలిసి సెకండ్ ఏఎన్ఎం ఏపీ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో2007,2008,2009 సంవత్సరాలలో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎంలుగా విధుల్లో చేరామని చెప్పారు. తమ సొంత మండలాలలో నిర్దేశించిన సబ్ సెంటర్లలో గత 16 సంవత్సరాలుగా తక్కువ వేతనాలకు పని చేస్తున్నామని వారు తెలిపారు. కోవిడ్ సమయంలో ఎందరో సెకండ్ ఏ ఎన్ ఎమ్ లు  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికీ వారి కుటుంబాలకు తగిన పారితోషం కూడా అందించలేదని వారు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేస్తానని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయా పరిస్థితుల నేపథ్యంలో సెకండ్ ఏ ఎన్ ఎమ్ లను రెగ్యులర్ చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నివాస్ ను కోరారు.


Comments