సైన్స్ పరంగా పరిశోధనలు పురోగతి సాదించాలి : ప్రొఫెసర్ క్వరైషా అబ్దుల్ కరీం.


 *సైన్స్ పరంగా పరిశోధనలు పురోగతి సాదించాలి  : ప్రొఫెసర్ క్వరైషా అబ్దుల్ కరీం.*


*ఘనంగా కెఎల్ యు 13వ స్నాతకోత్సవం.*

*4465 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం.*

*38 మందికి బంగారు పతకాలు, 41 మందికి రజిత పతకాలు.*

 తాడేపల్లి (ప్రజా అమరావతి);

సైన్స్ పరంగా పరిశోధనలు పురోగతి సాదించాలని, కోవిడ్ 19 ఇప్పటికీ మనతోనే కలిసి ప్రయాణం చేస్తుందని ప్రపంచ సైన్స్ అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ క్వరైషా అబ్దుల్ కరీం అన్నారు. కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ13వ స్నాతకోత్సవం వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె విద్యార్దులనుద్దేశించి మాట్లాడారు. వడ్డేశ్వరంలోని గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లో జరిగిన ఈ వేడుకకు వేలాదిగా విద్యార్దులు, తల్లిదండ్రులు పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథి ప్రొఫెసర్ క్వరైషా అబ్దుల్ కరీం, గౌరవ అతిథులు డాక్టర్ సిఎన్ ఆర్ రావు, అతిథి ప్రొఫెసర్ జి.యు.కులకర్ణి, సినీ నటుడు ఎం. మురళీ మోహన్ లకు కెఎల్ డామ్డ్ యూనివర్శిటీ తరుపున చాన్సలర్ డాక్టర్ కోనేరు సత్యన్నారాయణ గౌరవ డాక్టరేట్ లను ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ క్వరైషా అబ్దుల్ కరీం. మాట్లాడుతూ కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి పరస్పర అనుబంధాన్ని దెబ్బతీసిందన్నారు. అదే సమయంలో సైన్స్ పరంగా ఒకరితో మరొకరు కలిసి భాగ స్వామ్యంతో పరిశోధనలు చేయాడానికి పురిగొల్పిందన్నారు. ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో 6 సమర్థవంతమైన వ్యాక్సిన్‌ల అపూర్వమైన అభివృద్ధికి శాస్త్రవేత్తలు కృషి చేశారని తెలిపారు. ప్రజలను భయం, అనిశ్చితి, ఆత్రుత నుండి ఆశలోకి వెళ్లడానికి వ్యాక్సీన్ లు దోహదపడ్డాయన్నారు. అయితే,  ఈ వ్యాక్సిన్‌లను కనుగొనడంలో లేదా తయారు చేయడంలో భాగ స్వామ్యం కాని దేశాలకు కోవిడ్ పెను సవాల్ గా మారిందన్నారు.  ఈ వ్యాక్సిన్‌లను పొందడం చాలా తక్కువ అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్‌లను కలిగి ఉన్న దేశాల  వ్యవహార శైలి వైరస్ బలంగా మారేలా చేసిందన్నారు. కోవిడ్-19 ఇప్పటికీ మనతోనే ఉందన్నారు. మనం సార్స్ వైరస్ -2 తో ఎక్కువ కాలం జీవిస్తున్నందున, రోగ లక్షణాల నుండి లేదా తేలికపాటి లేదా లక్షణరహిత సంక్రమణ నుండి మరియు టీకాలు వేసుకున్న కొంతమంది వ్యక్తులు అనుభవించే అసంబద్ధమైన దీర్ఘకాలిక పరిణామాల నుంచి తాము అనేక కొత్త విషయాలను నేర్చుకుంటున్నామన్నారు. రాబోయే సుదీర్ఘ కోవిడ్ యొక్క సునామీ యొక్క సంగ్రహా అవలోకనం పొందడం ప్రారంభించామన్నారు.


*విద్య అంటే కేవలం వాస్తవాలు, అంకెలను గుర్తుపెట్టుకోవడం కాదు. గౌరవ అతిథి ప్రొఫెసర్ జి.యు.కులకర్ణి.* 

విద్య అంటే కేవలం వాస్తవాలు, అంకెలను గుర్తుపెట్టుకోవడం కాదన్నారు. విద్య స్వీయ పరివర్తన కోసమే. "నిజాయితీ మరియు ధర్మం యొక్క మూలం మంచి విద్యలో ఉందని" అని తత్వవేత్త ప్లూటార్క్ అన్నారని గుర్తు చేశారు.. అత్యున్నత విద్య కేవలం మనకు సమాచారాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని అన్ని అస్తిత్వాలతో సామరస్యంగా చేస్తుంది. చదువుతున్నప్పుడు, మనస్సులో ఎప్పుడూ యుద్ధం ఉంటుంది, ప్రత్యేకించి విషయం సాంకేతికంగా ఉంటే. వాస్తవానికి ఆలోచనను ఛేదించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలన్నారు. 

 


*ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. : సినీ నటుడు మురళీ మోహన్.*

ప్రముఖ సినీ నటుడు ఎం.మురళీ మోహన్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది ఏలూరు జిల్లాలోని చాటపర్రు గ్రామమని తెలిపారు. పది సాయం చేయడంలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది అని అన్నారు. నాటకరంగంపై మక్కువ పెంచుకున్న తాను విజయవాడలోని నటరాజ కళా మండలితో కలిసి స్టేజ్ డ్రామాలలో చురుకుగా పాల్గొనే వాడిని అని అన్నారు. అనుకోకుండా  అదృష్ట వశాత్తు తాను వెతకకుండానే సినిమా రంగంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, చిత్ర పరిశ్రమలో తాను ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిట్లు తెలిపారు. 2023వ సంవత్సరానికి తాను చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జయభేరి బ్యానర్ ను స్థాపించి దాని ద్వారా  25 చిత్రాలను నిర్మించినట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ మరియు ఆటోమొబైల్ విక్రయాలలోకి కూడా తన వ్యాపారాన్ని విస్తరించానన్నారు, అన్నీ జయభేరి గ్రూప్ అనే ఒకే గొడుగు క్రిందనే  వ్యాపారాలు కొనసాగాయన్నారు. 

*పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం : చాన్సలర్ , చైర్మన్ శ్రీ డాక్టర్ కోనేరు సత్యన్నారాయణ గారు.*

యూనివర్శిటీలో పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తమ విద్యార్దులు జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో అత్యధిక 50 లక్షలకు పైగా వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉందన్నారు. రానున్న కాలంలో అంతర్జాతీయ కంపెనీలలో కూడా ఉద్యోగాలు పొందేలా కృషిచేస్తున్నామని చెప్పారు. అందుకు తగిని విదంగా విద్యా ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ అద్యాపకులు అందుకోసం విద్యార్దులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారిలో నైపుణ్యాలను అభివృద్ది చేస్తున్నారన్నారు. ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాలలో ఉన్న విశ్వవిద్యాలయాలకు వెళ్లి తమ విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ ఏడాది 4465 విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అందులో 219 మంది పి. హెచ్. డి, 449 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 3 వేల 797 మంది గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 38 మంది విద్యార్థులకు బంగారు, 41 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు ఆయన చెప్పారు. తమ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఆయా విబాగాలలో సుమారు 170 జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. అందుకుగాను యుజిసి నుండి కెఎల్ యు కు వంద కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. తమ వర్సిటీ లో 1200 మంది అత్యంత నిపుణులైన అద్యాపకులు ఉండగా వారిలో 600 మంది వివిద విబాగాలలో డాక్టరేట్ లు సాదించినవారే కావడం విశేషమన్నారు. ఈస్నాతకోత్సవం వేడుకలో యూనివర్శిటీ కార్యదర్శి కోనేరు శివకాంచనలత, వైస్ చైర్మన్ కోనేరు రాజాహరీన్, ప్రో చాన్సలర్ చాన్సలర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు పాల్గొన్నారు.

Comments