తాడికొండ నియోజకవర్గంలో లాం గ్రామంలో జగనన్న ప్రగతిపథం పోస్టర్ విడుదల.
తాడికొండ (ప్రజా అమరావతి);
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 18న విజయవాడలో జరగనున్న జగనన్న ప్రగతి పదం ర్యాలీ పోస్టర్లను తాడికొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కత్తెర సురేష్ బుధవారం లాం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రగతి పదం ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. దేశంలోనే ఏ ప్రభుత్వం ఎక్కడలేని విధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను 98 శాతం పూర్తి చేసి 100% దిశగా అడుగులు వేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. గత టిడిపి ప్రభుత్వం నయవంచిన పాలన ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుపరిపాలనను ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలన్నారు. గుంటూరు జిల్లా ఐటి విభాగ అధ్యక్షులు మాదాసు కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తాడికొండ మండల పార్టీ అధ్యక్షుడు బొర్రా వెంకటేశ్వర్ రెడ్డి, జె సి ఎస్ కన్వీనర్ తాళ్ల శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు షేక్ మీర్జావలి రావూరి నరేష్, రావూరి ఫ్రాన్సిస్ , రాజపూడి సుబ్బరాజు, గుంటూరు జిల్లా ఐటీ వింగ్ కమిటీ సభ్యులు ఆర్ ప్రేమ్ కుమార్ ,దాసరి శ్రీకాంత్ యాదవ్ ,షేక్ అబ్దుల్ సలాం , వైయస్సార్సీపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు
addComments
Post a Comment