రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా

 విజయవాడ (ప్రజా అమరావతి);


ఎన్టీఆర్ జిల్లా

నందిగామ నియోజకవర్గం కంచికచర్ల లో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ కంచికచర్ల  అంబేద్కర్ నగర్ కి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్ పరామర్శించి, దైర్యం తెలియచేసిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు , తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు  తదితరులు ఉన్నారు.


మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు  మాట్లాడుతూ


 'నా ఎస్సీలు, నా ఎస్టీలు

అంటూ ప్రతి వేదికపై ముఖ్యమంత్రి జగన్ వారిపై ఎన లేని ప్రేమ ఒలకబోస్తున్నా.. వైకాపా పాలనలో దళితులపై దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోఅగ్రకులానికి చెందిన హరీష్ రెడ్డి అతని స్నేహితులు మరో ఆరుగురు . ఓ దళిత యువకుడిపై అమానుషంగా ప్రవర్తించారు.


దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ని కారులో తీసుకెళ్లి నాలుగు గంటలపాటు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తిప్పుతూ నరకం చూపించారు.

మంచినీళ్లు అడిగితే రహదారి మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేస్తూ అమానుషంగా

ప్రవర్తించారు.

కారులో నాలుగు గంటల పాటు తిప్పుతూ అతడిని అంతా తీవ్రంగా కొట్టారు. దాహంగా ఉందని అతను

ప్రాధేయపడగా కారును ఆపి రహదారి మధ్యలో కూర్చోబెట్టి మూత్రం పోసినట్లు సమాచారం.


 బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ, ఇవీ మీ బతుకులు అంటూ అవమానకరంగా దూషించారు.


 వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న  ధైర్యంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇంత జరిగితే పోలీసులు వాళ్ళ మీద పెట్టిన కేసులు చూస్తే అన్ని బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు మాత్రం పెట్టలేదు.


 ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయిపోయాయి. సామాజిక సాధికార బస్సు యాత్రలో చేస్తున్నటువంటి మంత్రులుకి సిగ్గుండాలి యువకుడు మీద హత్య ప్రయత్నం పై మంత్రులు ఏమి సమాధానం చెబుతారు?


 దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే వాడికి రెడ్ కార్పొరేట్ పరిచి సభలు సమావేశంలో పెద్దపీట వేస్తున్నారు. తాడేపల్లి కూతవీడు దూరంలో దళిత మహిళపై రేప్ చేసినటువంటి వెంకటరెడ్డి బయట తిరుగుతున్నాడు. రేపల్లె నియోజకవర్గం ఉప్పల వారి పాలెం లో అమర్నాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల కుర్రాడిని చంపిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు. మాస్క్ అడివి డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిని చేసి చంపారు. మాస్క్ ధరించలేదని చీరాలలో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని  కొట్టి చంపారు.


 ఈ రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా


అని చెప్పేసి నేను అడుగుతున్నాను?దీనిని నేను పూర్తి గా ఖండిస్తున్నాను....

Comments