నాసిన్ ను సందర్శించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

 నాసిన్ ను సందర్శించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

పుట్టపర్తి ,నవంబర్ 4 (ప్రజా అమరావతి): గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఉన్న జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్)ను శనివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్  రాష్ట్ర ప్రత్యేక ఆర్థిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్  జిల్లా జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తిక్ తదితరులతో కలిసి నాసిన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాసిన్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ( ఐ ఆర్ ఎస్) ఇండియన్ రెవెన్యూ సర్వీస్ శిక్షణ కేంద్రం కు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తొలుత నాసిన్ అకాడమిలో జరుగుతున్న పురోగతి గురించి సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐఆర్ఎస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులకు సంబంధించి మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన పనుల అభివృద్ధిపై ఆయా శాఖల ద్వారా ఆరా తీశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి నాసిన్ వరకు 34.15 కిలోమీటర్ల మేరకు నీటి సరఫరా పైపు లైన్ల పనులు ఏ దిశకు చేరుకున్న వివరాలను  ఏపీఐఐసి జోనల్ మేనేజర్ సోనీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అలాగే పాలసముద్రం చెరువు అభివృద్ధికి సంబంధించి రూ. 4 కోట్ల 32 లక్షల వ్యయంతో ఇదివరకే ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో  పాలసముద్రం చెరువుల తూముల మరమ్మత్తులు, కట్టల పటిష్టత చర్యలు, నీటి సరఫరా కాలువల మరమ్మతులు, చెరువు సామర్థ్యం పెంచడానికి అవసరమైన చర్యలు , జంగిల్ క్లియరెన్స్ తదితర అంశాలపై మైనర్ ఇరిగేషన్ గంగాధర్,  లక్ష్మి నారాయణతో చర్చించారు. అకాడమీ నందు గ్రీనరీ కు సంబంధించిన పనులకు సహకరించాలని అలాగే అవసరమైన మొక్కలను అందజేయాలని   అటవీ శాఖ అధికారి శ్యామలను మంత్రి సూచించారు.  ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఇప్పుడు వరకు జరిగిన ఎలక్ట్రికల్ లైన్స్ పనులు, నేషనల్ హైవే , రైల్వే లైన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా శాఖ అధికారుల తో సమీక్షించారు. అలాగే గత సమీక్ష సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటివరకు జరిగిన భవన నిర్మాణ వివరాలు అభివృద్ధి  పురోగతి మరియు పెండింగ్ పనులపై కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  చర్చించారు. వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయగలిగినట్లయితే సత్వరమే ఐ ఆర్ ఎస్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకొనేందుకు అవకాశం ఉంటుందని అందువల్ల వీలైనంత త్వరగా పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం పాత్రికేయ ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారాలతో నాసిన్ మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాసిన్ తోపాటు  రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే సంస్థలకు సంబంధించి  అన్ని విధాల సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నాసిన్ కేంద్రంలో  త్వరలోనే ప్రారంభం కానున్న ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ శిక్షణ కేంద్రంలో అన్ని వసతుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.  ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు లాగానే మన రాష్ట్రానికి ఐ ఆర్ ఎస్ మంజూరు కావడం శుభ పరి నామమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి కానునట్లు మంత్రి తెలిపారు. ఐఆర్ఎస్ శిక్షణ కేంద్రం ఇది కేవలం దేశానికే కాకుండా దక్షిణ ఆసియా ప్రాంతంలోని వివిధ దేశాల నుంచి కూడా అధికారులు ఈ కేంద్రంలో శిక్షణ   పొందే అవకాశం ఉందని రాష్ట్ర గౌరవానికి ఐఆర్ఎస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుఎంతో దోహదపడుతుందని మంత్రి తెలిపారు. నాసిన్ లో పనిచేస్తున్న అధికారులు మరియు ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్యను అందించి ప్రోత్సహించే దిశగా త్వరలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కానున్నట్లు మంత్రి తెలిపారు. స్థానికుల కుటుంబాల పిల్లలకు కూడా కేంద్రీయ విద్యాలయంలో వీలైనంతగా ప్రవేశ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు నాసిన్ పరిశీలించడానికి విచ్చేసిన మంత్రికి జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, సబ్ కలెక్టర్ కార్తిక్, కేంద్ర రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మలహోత్రా సిబిఐసి చైర్మన్ సంజయ్ అగర్వాల్, మెంబర్ అలోక్ శుక్ల, డైరెక్టర్ జనరల్ నాసిన్ ఆర్ కె రాఘవన్ ప్రిన్సిపాల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియుప్రాజెక్ట్ ఇంచార్జ్ నారాయణస్వామి తదితరులు మంత్రికి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి హుస్సేన్ పీరా, డి ఈ ఓ మీనాక్షి, సిపిఓ విజయకుమార్, రైల్వే శాఖ నాగభూషణం, ఏపీఎస్పీడీసీఎల్  షణ్ముఖం, నేషనల్ హైవే శ్రావణ్ కుమార్, నాసిన్ మేనేజర్ శ్రీకాంత్, గోరంట్ల తాసిల్దార్ రంగనాయకులు సోమందేపల్లి తాసిల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.


Comments