మహిళా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు జగనన్న పాలవెల్లువ పథకo.



రాజమహేంద్రవం (ప్రజా అమరావతి);


జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం యూనిట్స్ గ్రౌండింగ్ కు బ్యాంకర్ల తో సమావేశం నిర్వహించాలి


స్థానికంగా ఉన్న బ్యాంకర్ల తో యూనిట్స్ గ్రౌండింగ్ చొరవ చూపాలి



మండల స్థాయి అధికారులతో విసి లో దిశా నిర్దేశం



కలెక్టర్ మాధవీలత 


సహకార డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు తద్వారా మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి చేసేందుకు జగనన్న పాల వెల్లువ ఎంతో దోహదపడుతుందని  జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత అన్నారు. 


శనివారం జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై సంబంధిత మండల స్థాయి అధికారుల వీడీయో కాన్ఫరెన్స్  జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ తో కలసి నిర్వహించారు.  


ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత సమీక్షిస్తూ  ప్రభుత్వం సహకార డైరీ రంగాన్ని బలోపేతం చేసి తద్వారా మహిళా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు జగనన్న పాలవెల్లువ పథకాన్ని తీసుకొని వచ్చిందన్నారు. మహిళ పాడి రైతుల ప్రయోజనం కోసం చేపట్టిన సహకార డెయిరీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార సంస్థ తిరిగి బలోపేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ దోహద పడుతుందన్నారు. జిల్లాలో పాడి పశువుల అభివృద్దికి సంబందిత అధికారులు నిబద్దతతో పనిచేయాలన్నారు.


 నవంబరు 15 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ఈ నెల 30వ తేదీ వరకు సర్వే నిర్వహించి లబ్దిదారుల నుంచి అంగీకారం తీసుకోవాలన్నారు.  డిశంబరు 1 వ తేదీనాటికి రైతుల నుంచి పూర్తి స్థాయిలో డ్యాక్యు మెంటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. 


జిల్లా జగనన్న పాలవెల్లువ గ్రామాలలో పాడి పశువుల పెంపకానికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించా మన్నారు.  జిల్లాలో పాలు పోసే రైతులకు  క్షేత్రస్థాయిలో పశువుల గ్రౌండింగ్ కు సంబందించి మండలాల వారీగా లక్ష్యాలను నిర్ణయించామన్నారు. జిల్లాలో  పాలు పోసే రైతులుకు  ఆయా మండలాల వారీగా ఆనిమల్ గ్రౌండింగ్ యూనిట్లగా మొత్తం 1500 మంది రైతులకు గాను 1400 యూనిట్లను అందించా మన్నారు. ఇందులో భాగంగా 30 మంది రైతులుకు 28 యూనిట్లు, దేవరపల్లి 274 మంది రైతులకు 256 యూనిట్లు, గోపాలపురం లో 314 మంది రైతులుకు 294 యూనిట్లు, కొవ్వూరు మండలంలో 40 మంది రైతులకు 36 యూనిట్లు, నల్లజర్ల మండలంలో 432 మంది పాలుపోసే రైతులకు 406 యూనిట్లు, తాళ్ళపూడి మండలంలో 410 మంది రైతులకు 380 యూనిట్లను  మంజూరు చేసి అందించామని  పేర్కొన్నారు.


జాయింట్ కలెక్టరు ఎన్ . తేజ్ భరత్ సమీక్షిస్తూ జిల్లాలోని అమూల్ రైతులకు పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ అనే అంశాలపై సంవర్ధక శాఖాధికారి, డీఆర్డీఏ, డీసీవో ఎల్డీయం, సీఈఓ వంటి జిల్లా స్థాయి అధికారులుతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీనిధి, చేయూత లబ్ధిదారులను పాడి పశువులను కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. జగనన్న పాలవెల్లువకు సంబంధించి ఎపిడిడిసిఎఫ్‌, పశుసంవర్థక శాఖ, సెర్ప్‌, పంచాయతీరాజ్‌, డిఆర్‌డిఎ, సహకార శాఖ, జిల్లా యంత్రాంగం, అమూల్‌ సాంకేతిక విభాగం సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.


ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్ధక  అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్, డి ఎల్ డి వి పి. వీణా దేవీ, ఎల్ డి ఏం డి. దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



Comments