తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రములోని వ్యవసాయ అధికారులందరూ పూర్తిస్థాయిలో పాలనా యంత్రాoగానికి అందుబాటులో ఉండాలి.

  ప్రత్యేక వ్యవసాయ కమీషనర్ శ్రీ చేవూరు హరి కిరణ్ IAS వారు రాష్ట్రంలోని 26 జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. 

వాతావరణశాఖవారి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రములోని వ్యవసాయ అధికారులందరూ  పూర్తిస్థాయిలో పాలనా యంత్రాoగానికి అందుబాటులో ఉండాలని


తెలిపారు. ఖరీఫ్ వరి పంట ఎక్కువ ప్రాంతములలో కోతలు ముమ్మరంగా జరుగుతున్న కారణముగా వ్యవసాయ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ వరి కోతలు , కోత అనంతర తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ముందస్తు సమాచారం తెలుపుతూ వివధ మాధ్యమాల ద్వారా ముమ్మర అవగాహన , ప్రచారం చేయాలని తెలిపారు.

ఖరీఫ్ 2023 లో కురిసిన వర్షపాతం సాధారణ వర్షపాతంకన్నాతక్కువ నమోదు అయిన  కారణముగా వ్యవసాయ పంటల బీమా మరియు పంట కోత ప్రయోగాల పై క్షేత్ర సిబ్బంది మరింత దృష్టి పెట్టాలని తెలిపారు. పంట కోత ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని, లక్ష్యాన్ని చేరుకునే విధముగా జిల్లా స్థాయి / డివిజన్ స్థాయిలో జిల్లా ప్రణాలికా శాఖ, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ప్రైమరీ వర్కర్స్  మరియు వ్యవసాయ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పంట కోత ప్రయోగాల ప్రాముఖ్యతని వివరించాలని  కోరారు. జియో కోఆర్డినేట్ లతో కూడిన ఈ యాప్ లో ప్రైమరీ వర్కర్, పర్యవేక్షక అధికారితో పాటు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీ కోఅబ్జర్వర్ తో కూడిన భాగస్వామ్యం సంతకంతో రియల్ టైమ్ లో సమాచారాన్ని యాప్ లో నమోదు చేయటం ద్వారా మాత్రమే అర్హత సాధించ వచ్చునని తెలియచేశారు.

రబీ 2023-24 ఈ-క్రాప్ కి సంబంధించిన ఖరీఫ్ పంట కాలానికి ఇచ్చిన మార్గ దర్శక విధివిధానాలు రబీ పంట కాలానికి కూడా వర్తిస్తాయని తెలిపారు. తక్కువ పంట కాల పరిమితి ఉన్న శనగ,మినుము,మొక్క జొన్న పంటలు త్వరగా కోతకు వస్తాయి కాబట్టి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని త్వరగా వారి పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

విత్తన సరఫరాకి సంబందించి మాట్లాడుతూ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో రాబోవు మూడు,నాలుగు రోజులలో కురిసే వర్షాలు మేలు చేసే విధముగా వుంటే ఆ వర్షాలను సద్వినయోగం చేసుకుని ఇంకా అమ్మకం చేయని విత్తనాలను విక్రయం చేయాలని, ఇంకా శనగ విత్తనాలు కావలసిన వారు 15 డిసెంబర్ లోపు ముందు గానే ఇండెంట్ పెట్టాలని తెలియచేశారు.

GAP (గాప్) పొలంబడి పధకం గురించి సమీక్ష జరుపుతూ ఇండ్ గాప్ (Ind GAP)  ధృవీకరణ సర్టిఫికెట్ లను ఎక్కువ జిల్లాలు పొందే విధముగా జిల్లా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కోరారు . నాణ్యత ప్రమాణాలను  సూచించే సర్టిఫికెట్స్ పొందే విధముగా నమూనాలను పంపాలని కోరారు. దేశములోనే మొట్ట మొదటి సారిగా మన రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా GAP పొలంబడి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నామని తెలియ చేసారు. నమూనాలలో ఉత్తమ ప్రమాణాలను పొందిన ఉత్పత్తులకు వారి పరిధిలో మరింత గిరాకీ పెరిగే విధంగా వివిధమాధ్యమాలను మరింత ఉపయోగించి వినియోగ దారులకు ఆ సమాచారం చేరే విధముగా సరి అయిన అవాగాహన, ప్రచారాలను చేపట్టాలని సూచించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ &అనుబంధ రంగాల్లో నూతన సాంకేతిక ,ఆధునిక సమాచారాన్ని అందిస్తూ ప్రచురితం అవుతున్న రైతు భరోసా మాగజైన్ ల సబ్స్క్రిప్షన్ లను మరింత పెంచాలని కోరారు.గ్రామ స్థాయి లోని రైతు భరోసా కేంద్రాలలో జరుగుతున్న వ్యవసాయ సలహా మండలి సమావేశపు అజెండా అంశములు, వాటి సమచారపు విషయములలో మరింత నాణ్యతను 

Comments