జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగ్గ రోజు.*జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగ్గ రోజు*

  

*పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి చొరవతో రూ.4,640కోట్ల పెట్టుబడితో పుంగనూరుకు ప్రముఖ జర్మన్ ఎలక్ట్రిక్ బస్సులు, తయారీ పరిశ్రమ . .* 


*పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర విద్యుత్, ఇందన, అటవీ శాఖ మంత్రి, రాజంపేట ఎంపి లకు ధన్యవాదాలు*

 

*పరిశ్రమ ఏర్పాటుతో వలసలకు  సెలవు . . యువతకు ఉపాధి దిశగా ముందడుగు*


                                *: జిల్లా కలెక్టర్*


*భారత దేశం  పెప్పర్ మోషన్ సంస్థ కు రెండవ పుట్టినిల్లు* 


*పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నుండి జిల్లా కలెక్టర్ వరకు అందించిన సహకారం ఎనలేనిది* 


*స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం*


           *: పెప్పర్ మోషన్ సంస్థ సి ఈ ఓ*   


పుంగనూరు,డిసెంబర్ 1 (ప్రజా అమరావతి):జిల్లా లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి చొరవతో దేశంలో అత్యాధునిక టెక్నాలజీతో చిత్తూరు జిల్లా పుంగనూరు లో ప్రముఖ జర్మన్ పరిశ్రమ ఎలక్ట్రిక్ బస్సులు తయారీ చేసే పెప్పర్ మోషన్ పరిశ్రమ ను  ఏర్పాటు చేసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ తెలిపారు. 


పుంగనూరు లో  పెప్పర్ మోషన్ ఎలక్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్,పెప్పర్ మోషన్ ఎలక్రిక్ వాహనాల తయారీ  సంస్థ సి ఈ ఓ, ప్రతినిధి బృందం తో కలసి శుక్రవారం పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయం వద్ద విలేరుల   సమావేశం నిర్వహించారు.


 ఈ సమావేశంలో పెప్పర్‌ మోషన్‌ సీఈవో ఆండ్రియాస్‌ హేగర్,సీటీవో డాక్టర్‌ మథియాస్‌ కెర్లర్‌, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఉవే స్టెల్టర్, నా ఉర్త్ ఎలక్ట్రానిక్ ఇండియా ఎండి హర్ష ఆద్య, పెప్పర్ మోషన్ సిఐఓ రాజశేఖర్ రెడ్డి నల్లప రెడ్డి, సి ఎస్ వో సత్య బులుసు,సీసీవో రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.


          *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్* మాట్లాడుతూ జిల్లా చరిత్రలో ఈ దినం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని, రూ.4,640 కోట్ల పెట్టుబడితో 800 ఎకరాల విస్తీర్ణంలో పుంగనూరు లో ప్రముఖ జర్మన్ పరిశ్రమ పెప్పర్ మోషన్ ఎలక్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర విద్యుత్, ఇందన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి, లోక్ సభ ప్యానల్ స్పీకర్ పి.వెంకటమిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగాల కొరకు తన కుటుంబాన్ని, గ్రామాన్ని వదిలి బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా పెప్పర్ మోషన్ ఎలక్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా. స్థానికం గా 8100  ఉద్యోగాలు పొందవచ్చునని తద్వారా ఈ పరిశ్రమ చుట్టూ ఉన్న భూముల విలువ పెరుగు తుందని, పుంగనూరు ముఖచిత్రం మారుతుందని, అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా కాలుష్యం చాలా తక్కువ శాతం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు. 2024 ఫిబ్రవరి నెలలో పరిశ్రమ నిర్మాణం ప్రారంభించేలా ప్రణాళికా రూపొందించడం జరిగిందని, పరిశ్రమ ఏర్పాటుకు స్థానిక ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. 


           *పెప్పర్ మోషన్ సంస్థ సిఈఓ ఆండ్రియాస్‌ హేగర్* మాట్లాడుతూ భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో ఉన్న జనాభా కారణంగా రవాణా వ్యవస్థలో అధికంగా బస్సులు, ట్రక్కులను వినియోగించడం జరుగుతుందని, దీని ద్వారా అధిక శాతం కార్బన్ వాయువులు వెలువడతాయని, వీటి ద్వారా వాతావరణం కాలుష్యం అవుతుందని, కాలుష్య నివారణ ప్రధాన అంశంగా తమ స్వంత టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేయడం జరుగుతున్నదన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతలను పొందేందుకు ముఖ్యమంత్రి నుండి జిల్లా కలెక్టర్ వరకు అందించిన సహకరం మరువలేనిదన్నారు. 2024 మార్చిలో పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని, 2027 సం.లోపు మూడు దశలలో నిర్మాణ పనులు పూర్తి చేసి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీని ప్రారంభించేలా చర్యలు చేపడతామని, చదువుకున్న యువతకు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నారు. పూర్తి ఇంటిగ్రేటెడ్ విధానంలో, పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్ ల తయారీకి అవసరమైన అన్ని విడి భాగాలను స్థానికంగా తయారు చేయడం జరుగుతుందని, ఈ వాహనాలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతుందన్నారు. 


           *పికెయం ఉడా ఛైర్మన్ వెంకటరెడ్డి యాదవ్* మాట్లాడుతూ స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, రాజంపేట ఎంపిల కృషితో పుంగనూరులో పెప్పర్ మోషన్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్ ల తయారీ యూనిట్ ను తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని తెలిపారు.


ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పరిశ్రమ ను పుంగనూరులో స్థాపించడం ఎంతో సంతోషకరమని  తెలిపారు..


        ఈ కార్యక్రమం లో పలమనేరు ఆర్ డి ఓ మనోజ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ సీతారాం,ఎంపిడిఓ నాగరాజు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.Comments